కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు బడ్జెట్-2022ను ఆవిష్కరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా సీఐఐ మాజీ అధ్యక్షడు రామకృష్ణ బడ్జెట్ పై మాట్లాడారు. ఇది చాలా మంచి బడ్జెట్ అన్నారు. పన్నుల్లో పెద్దగా మార్పులు లేవన్నారు. మౌళిక, రవాణా రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టారన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణాల మొత్తాలను పారిశ్రామిక అభివృద్ధిపై పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. పరిశ్రమలకు నిధులు ముఖ్యమన్నారు. డిజిటల్ ఎడ్యూకేషన్‌కు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడం మంచి విషయమన్నారు. ఈ బడ్జెట్ భవిష్యత్తులో అభివృద్ధికి దోహదం చేస్తుంది. దేశ ప్రయోజనాల కోసం ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు.క్రిప్టో కరెన్సీ పై ఇంకా పూర్తిగా క్లారీటీ రావాలని తెలిపారు. ఒకే రిజిస్ట్రేషన్ విధానం ఉపయోగకరం.. పారదర్శకంగా ఉండే అవకాశం ఉంటుందని వెల్లడించారు.
Read Also: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రికార్డు
గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ బాగుంది: తరుణ్ కాకాని, సీఐఐ సౌత్ జోన్ మెంబర్
గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ బాగుందని సీఐఐ సౌత్ జోన్ మెంబర్ తరణ్ కాకాని అన్నారు. కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నామన్నారు. కరోనాతో టూరిజం దెబ్బతిన్నదన్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం ను పొడగించారు. కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ద్వారా సిమెంట్, అనుబంధం రంగాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆక్వా ఉత్పత్తులపైన కస్టమ్స్ డ్యూటీ 5 శాతానికి తగ్గించారన్నారు. రైతులకు పెద్దపీట వేస్తూ ..కిసాన్ డ్రోన్ టెక్నాలజీ ప్రవేశపెట్టారన్నారు. సార్టప్ కంపెనీలకు, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా పన్ను రాయితీలను ఈ బడ్జెట్‌లో కల్పించారన్నారు.