తెలంగాణ బడ్జెట్‌పై సెటైర్లు వేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి… పేరు గొప్ప.. ఊరు దిబ్బలా బడ్జెట్ ఉందంటూ ఎద్దేవా చేసిన ఆమె.. బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య రంగానికి చాలా తక్కువ శాతం కేటాయించారు. రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.. గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆమె.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించారని ఆరోపించారు.. ఇక, సభ నుంచి బీజేపీ ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయడం సరైంది కాదని దుయ్యబట్టిన రాములమ్మ.. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేశారు.
Read Also: DCGI: గుడ్‌న్యూస్.. చిన్నారుల వ్యాక్సిన్‌కు అనుమతి
బడ్జెట్ అంటే కేసీఆర్ సర్కార్ విలువ లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు రాములమ్మ.. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానాస్పదంగా ఉందన్న ఆమె.. అన్నీ గాలి లెక్కలు చూపించారు. విద్యా వ్యవస్థలో మౌలిక వసతులకు తప్ప, టీచర్ల భర్తీ గురించి చెప్పలేదు. అలాగే కార్పొరేషన్లకు నిధులు లేవన్నారు… ప్రతి అంకెకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఉపాధికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్‌లో లేదు. ముందుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలి. ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్న ఆమె.. రైతుబంధు, భీమా లాంటి పథకాలకు తప్ప, వ్యవసాయరంగంలో మిగతా వాటికి కేటాయింపులు లేవన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని మండిపడ్డ ఆమె.. తెలంగాణను తెగనమ్మితేగాని ఆదాయం రాని పరిస్థితి నెలకొందన్నారు.. భూములు, జాగాలు అమ్మాలి. లిక్కర్ తాగించాలి… లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. ఏడేండ్లలో ఏడు రెట్లు అప్పులు చేసి రుణభారాన్ని రూ.5 లక్షల కోట్లకు చేర్చారని వామర్శించారు.. ఏడాదికి రూ.30 వేల కోట్లు అప్పుల మిత్తీలకే సరిపోతే… ఇక రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అని ప్రశ్నించిన ఆమె.. బంగారు తెలంగాణ చేసిన… అని చెప్పుకొంటున్న దొరగారు, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎవరికోసం చేశారు? అని నిలదీశారు విజయశాంతి.