ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది..శాసనభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి నేరుగా బడ్జెట్‌పై చర్చ చేపడతారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ జరపనున్నారు. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్ఇ, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
Telangana Budget : తెలంగాణ అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు మధ్యాహ్నం 12.10 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధిలో ముందుకెళ్తున్నదని చెప్పారు. విస్తీర్ణంలో హైదరాబాద్ కన్నా సింగపూర్ చిన్నగా ఉంటుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఎన్‌హెచ్‌ఆర్డీ ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సుకు మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.