ఇవాళ్టి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం అవుతుంది. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ…
ఫిబ్రవరి 1 వ తేదీన కేంద్రం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అదేరోజున రైల్వే బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. గతేడాది రైల్వే బడ్జెట్ 1,10,055 కోట్లు కాగా, ఈ ఏడాది బడ్జెన్‌ను డబుల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైల్వే బడ్జెట్‌కు సంబంధిత మంత్రిత్వశాఖ తుదిమెరుగుతు దిద్దుతున్నది. ఇక ఇదిలా ఉంటే, గతేడాది రైల్వే శాఖకు సుమారు 26,338 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. కరోనా కారణంగా వివిధ రైళ్లు ఆగిపోవడంతో ఈ నష్టం సంభవించింది. కాగా,…
తాలిబాన్ ఆధ్వర్యంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం జాతీయ బడ్జెట్ ముసాయిదాను సిద్ధం చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ వలీ హక్మల్ తెలిపారు. ఈ బడ్జెట్ కోసం రెండు దశాబ్దాలలో మొదటిసారిగా విదేశీ సహాయం లేకుండా నిధులుసమకూరుస్తున్నట్లు ఆయన చెప్పారు. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కూరుకుపోయిన ఆప్ఘాన్‌కు ఈ బడ్జెట్ చాలాముఖ్యమైనది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక చాలా బ్యాంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకులు భగ్గుమంటున్నాయి.…
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పుకున్నారు. అంతేకాదు, పెళ్లి ఘనంగా చేస్తాం, పెళ్లికోసం 40వేల డాలర్లు ఖర్చుపెడతామని హామీ ఇచ్చారు. దీంతో పెళ్లికూతురు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకుంది. బడ్జెట్ వేసుకుంది. అయితే, చివరకు తల్లి వచ్చి బడ్జెన్ ను 20 వేలకు తగ్గించడంతో యువతి తల్లిదండ్రులపై అగ్గిమీద గుగ్గిలం అయింది. పెళ్లికి కనీసం 25వేల డాలర్లు ఖర్చు చేయాలని లేదంటే ప్రేమించిన యువకుడితో లేచిపోతానని బెదిరించింది. తల్లిదండ్రులే 40వేల డాలర్లు ఖర్చు…
ఏపి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. ఒక్కరోజు మాత్రమే ఈ బడ్జెట్ సమావేశం జరగనున్నది. ఈ సమావేశాల్లో ఉదయం 9 గంటలకు గవర్నర్ ప్రసంగించారు. అనంతరం సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన సభలో 2021-22 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ అంచనా రూ.2,29,779.21 కోట్లు. వెనక బడిన కులాలకు బడ్జెట్ లో 32శాతం అధికంగా నిధులు కేటాయించారు. ఇక ఏ…
2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ‘ఆత్మ నిర్భర్ భారత్’ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసం కీలక సంస్కరణలు చేపడుతున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి… అన్ని రంగాలకూ సమన్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా వస్తువుల ధరల్లో తగ్గుదల, పెరుగుదల కనిపిస్తుంది. తాజా బడ్జెట్ నేపథ్యంలో ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయో, ఏయే…
కోవిడ్ 19 అన్ని రంగాలను కుదిపేసింది.. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది.. దీంతో, దేశాన్ని మన్ని ఆర్థికంగా ముందుకు నడిపించాలంటే పన్నులు తప్పవనే ప్రచారం సాగింది.. రాబడి పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 సెస్ విధించేందుకు సిద్ధమైందనే ఊహాగానాలు వినపడ్డాయి. కానీ, ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేస్తున్నాయి అధికార వర్గాలు.. కోవిడ్-19 సెస్ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, యూనియన్ బడ్జెట్‌కు ముందు కూడా ఇలాంటి…