రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన దేశ బడ్జెట్‌ను మరికొన్ని రోజుల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వేళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో గూఢచర్యం ఘటన కలకలం రేపుతోంది.
PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఈ నెల 23వ తేదీన కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31న ప్రారంభం కానున్నాయి. ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేయనున్నారు.
ఫిట్‌నెస్ గురించి రకరకాల చాలెంజ్‌లు విసురుకున్నారు.. కేంద్ర మంత్రుల నుంచి బాలీవుడ్ స్టార్ట్స్, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొనడం.. మరికొందరికి సవాల్ విసరడం.. ఆ మధ్య తెగ ట్రెండ్ అయ్యింది.. అయితే, ఇప్పుడు.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఎంపీకి విసిరిన చాలెంజ్ చర్చగా మారింది.. బరువు తగ్గాలని సూచించిన గడ్కరీ.. కిలోకి వెయ్యి కోట్ల చొప్పున ఇస్తానంటూ ఆ ఎంపీకి సవాల్ చేశారు.. దీంతో, తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు…
టాలీవుడ్ హీరోలలో మార్పు వస్తోందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం రావటం లేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ ఎప్పుడూ లేనంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా టాలీవుడ్ వెలిగిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ అదంతా మేడిపండు చందం అని కొట్టి పడేస్తున్నారు అనుభవజ్ఞులు. అసలేం జరుగుతోంది అంటే టాలీవుడ్‌లో ప్రస్తుతం అన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ అనే నగ్నసత్యాన్ని బయటపెడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అంటూ ఢంకా బజాయించి చెవులు హోరెత్తిస్తున్న సినిమాలు సైతం రియల్‌గా బాక్సాఫీస్ వద్ద…
దేశం అప్పుల కుప్పలా ఎందుకు మారింది?రాష్ట్రాలు, కేంద్రం పోటీ పడి అప్పులు చేస్తున్నాయా?కోటి కోట్ల అప్పు తీరేదెలా?దేశం శ్రీలంకలా మారే ప్రమాదం ఉందా? అప్పుడే తెల్లారిందా అంటూ… అప్పునే తలుచుకుంటూ నిద్రలేస్తాం..ఓ ఫైవ్ ఉందా గురూ అనేది ఒకప్పటి మాటైతే.. ఇప్పుడది ఓ వందుందా అనే వరకు చేరింది. ఇది సామాన్యుడి చిల్లర అప్పుల సంగతి మాత్రమే. కానీ, ప్రభుత్వాల అప్పులు వంద లక్షల కోట్లను దాటేశాయి. అంటే దేశంలో ప్రతిఒక్కరూ… అప్పుడే పుట్టిన బిడ్డతో సహా…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. 5 వ రోజు కొనసాగనుంది శాసనసభ. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపడతారు. ఇవాళ చేపల పెంపకం, హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్ధి కార్యక్రమం గురించి చర్చిస్తారు. అలాగే, నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర నగరాల్లో ఆర్టీసీ బస్ ల సౌకర్యం గురించి మంత్రులు సమాధానం ఇస్తారు, రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, భూపాల…
ఏపీ అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర బడ్జెట్ చూస్తుంటే అప్పులు చేసి పథకాలకు పంచేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్ళేటట్లు ఉందన్నారు. ఏ ప్రాంతం అభివృద్ధి కోసం బడ్జెట్ లో ప్రస్తావన లేదు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టు లకు ఎందుకు నిధులు కేటాయించలేదు. మసిపూసి మారేడు కాయ చేసే బడ్జెట్ ఇది. ఏ ప్రాంతాన్ని ఆలోచింపచేసే బడ్జెట్ కాదు ఇది. బడ్జెట్ ను…