తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలనా విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం ఆహ్వానించింది.
Telangana Assembly: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఖరారయ్యాయి. డిసెంబర్ 9వ తేదీ నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.
గత ప్రభుత్వం చేయని పనులను మనం చేసుకునే అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు డిపార్ట్మెంట్ల వారిగా రూ. 1035 కోట్ల పనులను మంజూరు చేసుకున్నాం.. ఈ రోజు ఈ ప్రాంతానికి ఇన్ని నిధులతో అభివృద్ధి చేసుకోవడానికి కారణం.. ఆరోజు మీరు పార్లమెంట్ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలవడమే అందుకు కారణం అని చెప్పుకొచ్చారు.
Harish Rao: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తన మీద నమోదైన కేసును కొట్టివేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట తీరు, వ్యవహార శైలి గతానికంటే కాస్త భిన్నంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మహబూబ్నగర్ రైతు పండుగ వేదిక నుంచి మొదలుకుని.. తాజాగా జరిగిన సభల వరకు ఆయన ప్రసంగం చూస్తుంటే .. వ్యూహం మారినట్టు కనిపిస్తోందన్నది వారి మాట. శనివారం నిర్వహించిన రైతు పండుగ సభలో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. రైతులకి ఏం చేస్తున్నాం.. ఏం చేయబోతున్నామని చెబుతూనే.. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది ఉత్సవాలను చేస్తుంటే.. కాంగ్రెస్ పాలన చూసి బీజేపీ ఓర్వలేక పోతుందని విమర్శించారు.
ఒక హోటల్ నుంచి మాజీ ఎమ్మెల్యే డబ్బులు మాయం అయిన ఉదంతం కరీంనగర్ లో కలకలం సృష్టించింది. ఇటీవల దీక్షాధీవస్ సభ జనసమీకరణ కోసం భారీగా డబ్బుల ఖర్చు చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జిలకు పదిలక్షల రూపాయల చొప్పున సర్ధుబాటు చేసినట్లు సమాచారం. పదిలక్షలలో కేవలం ఐదులక్షలే ఖర్చు చేశారని.. కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా.. కార్యక్రమం ముగిసిన తరువాత వి పార్క్ హోటల్ లోని రూం నంబర్ 209 లో కార్యకర్తలతో కలిసి విందు ఏర్పాటు చేశారు. ఉదయం…
కాంగ్రెస్ ఏడాది పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఆరు అబద్ధాలు-66 మోసాలు అంటూ బీజేపీ ఛార్జ్షీట్ను విడుదల చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని .. హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధ్యం అయ్యిందన్నారు.