పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఏడాది మా పాలనపై చర్చకు మేం సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామని ఆయన తెలిపారు.
సంగారెడ్డి సెంట్రల్ జైలులో కేటీఆర్ ములాఖత్ ముగిసింది. సుమారు 40 నిమిషాలు 16 మందితో ములాఖత్ సాగింది. ములాఖత్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల, హాకింపేట రైతులు గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారని, రాబందుల్లా రేవంత్ రెడ్డి పేదల భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో అమృత్ టెండర్స్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది విపక్షాల ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే.. తానము ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ విమానం ఎక్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. దాంతో ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఓ రేంజ్లో హైప్ వచ్చింది.
నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు.. ఇక, సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు.. కానీ సురేష్ కు భూమి ఉంది.. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను.. వాళ్లు పూర్తి కాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్ ల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండవద్దని చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
Patnam Narender Reddy Reacts on Remand report in Lagcherla Incident: లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడి కేసులో అరెస్ట్ చర్లపల్లి జైలులో రిమాండ్ లో ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చారు. పోలీసులు నా పేరుతో నిన్న బయటకు వచ్చిన కన్ఫెషన్ రిపోర్టు తప్పు అని తెలిపారు.
Harish Rao: రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫార్మా సిటీ కేంద్రంగా తెలంగాణలో పొలిటికల్ సెగలు పెరుగుతున్నాయా? రాజకీయంగా వాడుకునేందుకు గులాబీ స్కెచ్ రెడీ అయిందా? ఆ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అరెస్ట్‌ల వెనకున్న మైలేజ్ లెక్కలేంటి? పార్టీ పెద్దల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? ఒకదాని వెంట ఒకటిగా వివిధ అంశాలను ఎత్తుకుని కాంగ్రెస్ సర్కార్‌ని ఇరుకున పెడదామనుకుంటున్న బీఆర్ఎస్ని అదే స్థాయిలో అరెస్ట్‌ల భయం కూడా వెంటాడుతోందట. తాజాగా వికారాబాద్ కలెక్టర్ మీద దాడి కేసులో ఇరుక్కున్నారు ఆ పార్టీ…
Patnam Narender Reddy: వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతవరణం కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ లోని అడిషనల్ ఎస్పీ కార్యాలయం డీటీసీ నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
Harish Rao: ప్రశ్నించే గొంతును నిర్బంధాలతో అణిచివేయలేరని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు.