Kishan Reddy : కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే అంశం పై పూర్తి గణాంకాలతో రిపోర్టు తయారు చేస్తున్నాం.. త్వరలోనే ప్రముఖుల సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్థానిక ప్రముఖులను ఆహ్వానించి మోదీ తెలంగాణకు ఏ విధంగా ప్రాధాన్యతనిస్తున్నారో వివరించాలని కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి సూచించారు. పవర్ ప్రాజెక్టులకు ఇచ్చే మొత్తం రుణాల్లో 16శాతం తెలంగాణకే కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఏం చేసింది.. రాష్ట్రం ఏవిధంగా సహకరించకుండా అడ్డుకుంటుంది అన్న వివరాలను ప్రతి జిల్లాలో కనీసం వెయ్యి మందిని ఆహ్వానించి వివరించాలన్నారు. బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు వల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్పులు ఇస్తుంటే బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. స్కాలర్ షిప్పు నిధులను నేరుగా విద్యార్ధి అకౌంట్లో వేసేందుకు డిజిటల్ చేయాలని సంకల్పించి వివరాలు అడిగితే.. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటూ స్కాలర్ షిప్పులు రాకుండా చేస్తోందన్నారు మంత్రి కిషన్ రెడ్డి.
Read Also: Crime News: భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య
సైన్స్ సిటీకి 25 ఎకరాలు ఇవ్వాలని కోరుతూ లేఖ రాస్తే బీజేపీకి పేరొస్తదనే అక్కసుతో ల్యాండ్ ఇవ్వడం లేదన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణకు రాష్ట్ర నిధులివ్వకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు మంత్రి. వరంగల్ లో రైల్వే ఓరాలింగ్ కోచ్ కోసం ల్యాండ్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు. అలాగే చర్లపల్లిలో అప్రోచ్ రోడ్డుకు ల్యాండ్ ఇవ్వకపోవడంతో మూడేళ్లు పని ఆగిపోయిందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా భూసేకరణకు అడ్డంకులు స్రుష్టిస్తోంది. ల్యాండ్ ఇబ్బందులతో 13 వందల కి.మీల రైల్వే పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం దుబాయి, గల్ఫ్ దేశాలకు వెళ్లి సఫాయి పని చేస్తున్న తెలుగు వారికి స్కిల్ డెవలెప్ శిక్షణనిచ్చి ప్రవాసీ కౌశల్య వికాస్ యోజన కింద ఉపాధి కల్పిస్తాం. విదేశాల్లోని భారత పరిశోధకులకు రీసెర్చ్ కోసం తగిన నిధులిచ్చేందకు శ్రీకారం చుట్టింది. ఎన్ఆర్ఐలు స్వదేశంలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు నెలకొల్పడానికి సింగిల్ విండో సిస్టమ్ కింద అనుమతి ఇస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: BJP v/s MRPS: మహబూబ్ నగర్లో ఉద్రిక్తత.. బీజేపీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ