Bandi Sanjay: మేము ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని Bjp రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికలకు మేం కూడా సిద్ధం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే అన్నారు. ఆ మాట కేటీఆర్ తన తండ్రితో చెప్పించాలని సవాల్ విసిరారు. మా పార్టీలో కోవర్టులు ఉండరని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి.. ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాడ్ చేశారు. ఈటల అలా అన్నారని నేను అనుకోనని తెలిపారు. రైతుల ఆత్మహత్య లో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉందని మరో సారి గుర్తుచేశారు బండి సంజయ్. 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరి దీనిపై మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
Read also: Cheating Couple: సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో దంపతులు భారీ మోసం.. లబోదిబో మంటున్న బాధితులు
నిన్న నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ సార్వత్రిక ఎన్నికలపై చేసిన సంచలన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. నిన్న నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఓల్డ్ కలెక్టరేట్ వద్ద కళా భారతి భావన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ సందర్భంలో వచ్చినా అన్ని పరీక్షలకు నిజామాబాద్ నుంచే తిరుగులేని సమాధానం ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా.. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ తో సహా జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలు కూడా గెలుచుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సిద్దంగా వుండాలన్నారు. ఇక రాబోయే ఏడు నుంచి తొమ్మిది నెలపాటు నిర్విరామంగా అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజాహితమైన కార్యక్రమాల్లో అందరూ పనిచేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నిజామాబాద్ జిల్లాకు ఒక చక్కటి అపురూపమైన కానుక అందించాలని ఉద్దేశంతో రూ. 50 కోట్లతో ఒక అత్యుత్తమమైన కళాభారతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు.
BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ