నిజమాబాద్ జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు. పునర్విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హామీ నెరవేర్చ లేదని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో అసమర్ధ ప్రభుత్వం ఉందని, కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టె చివరి బడ్జెట్ లోనైన తెలంగాణకు ఇచ్చిన హామీ లు నెరవేర్చాలని ఆయన డిమండ్ చేశారు. షబ్ కా సాత్ సబ్ కుచ్ బాక్ వాస్ గా చేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క పైసా అదనంగా కేంద్రం తెలంగాణ కు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. నేను చెప్పింది తప్పు ఐతే.. రాజీనామాకు సిద్ధమన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా ? అన్నారు. దుర్మార్గపు, అసమర్ధ ప్రభుత్వం కేంద్రంలో ఉందన్నారు.
Also Read : Roman City : ఈజిప్టులో అతి పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్న ఆర్కియాలజిస్టులు
మనం కట్టే పన్నుల్లో 46 శాతం మాత్రమే తిరిగి వస్తున్నాయని, తాను చెప్పింది తప్పయితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. జాతీయ రహదారులు వేసి టోల్ వసూలు చేస్తలేరా? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. మోదీని దేవుడు అంటున్నారు.. ఎవరికి దేవుడు? అని ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర కొట్లాటను అపలేని వ్యక్తి.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారట.. అంటూ ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి ఒకటిన పెట్టే బడ్జెట్ చివరి బడ్జెట్ అవుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. అంతేకాకుండా.. రాష్ట్రంలో ముందస్తుకు ఛాన్స్ లేదన్న కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ముందస్తుకు రెడీ అని సవాల్ విసిరారు. మీరు రద్దు చేయండి మేము రద్దు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్.
Also Read : Budget and Startups: కేంద్ర బడ్జెట్.. స్టార్టప్‌లకు ఏమిస్తుంది?