ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములపై మాట్లాడారు.. కానీ అవి పోడు భూములు కావు.. అన్యాక్రాంతమైన భూములని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో గిరిజనులను వంచించారు… కించపరి చేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు. సర్వే చేశామని, 11 లక్షల ఎకరాలు ఉన్నట్లు చెప్పారని, వాస్తవానికి అసలు సర్వే కూడా చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. పలు కులాలకు ఎస్టీ జాబితాలో కలుపుతున్నట్లు చెప్పారని, కాయితి లంబాడీలు అనే తెగ అసలు లేనే లేదని, మరి 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఎక్కడ దొరికిందో అంటూ ఆయన సెటైర్ వేశారు. చల్లప్ప కమిషన్ లో 9.08 శాతం ఎస్టీలు ఉంటే ఇతర కులాలను చేర్చి 10 శాతం చేయాలని చూస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ఎవరినీ సంప్రదించకుండా ఎలా చేస్తారని, ఇది కేసీఆర్ పారాసిటమోల్ తెలివి అని ఆయన విమర్శించారు. ఆయనే సైంటిస్ట్, ఆయనే డాక్టర్ అని ఫీల్ అవుతున్నట్లున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : Pakistan: దైవదూషణ పేరుతో హత్య.. పోలీసుల ముందే ఘటన..
గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన బంధుకు నిధులు ఎందుకు కేటాయించలేదని ఆయన ప్రశ్నించారు. 10 లక్షలు ఇవ్వడం పక్కనపెడితే.. కనీసం బడ్జెట్ లో ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. గిరిజన సహకార సంఘం నిధులు కూడా దుర్వినియోగం చేశాడు కేసీఆర్ అని ఆయన దుయ్యబట్టారు. ట్రిబ్ కో పేరిట పెట్టిన గిరిజన పవర్ కార్పొరేషన్ పని చేయడం లేదని, రైతు ఆత్మహత్యలు పెరగడం తెలంగాణ మోడలా? అని ఆయన ప్రశ్నించారు. 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వైన్స్ షాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనడం ఏంటి? ఇది అబద్ధం కాదా? అని ఆయన అన్నారు. కేసీఆర్ సర్కారు చేసే అవినీతి, లిక్కర్ స్కామ్ లో ఆయన బిడ్డ చేసిన అవినీతి గురించి స్పందించరని, గిరిజనులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.. వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఆయన అన్నారు.
Also Read : Viral: ఆ ప్రాంతంలో ప్లేట్ తన్నుతూ భర్తలకు భోజనం పెడతారు.. ఎందుకో తెలుసా?