Sambani Chandrasekhar: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ ఇస్తామని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం వెంగళరావు నగర్లో కాంగ్రెస్ హథ్ సే హథ్ జోడో అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంభాని ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలుపుతూ కాంగ్రెస్ కు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సంభాని మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని.. పేదరిక నిర్మూలన చేసేందుకే రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సంభాని.
Read Also: Black Magic: క్షుద్ర శక్తులొస్తాయని మంత్రగాడిని బలిచ్చి రక్తం తాగిన శిష్యుడు
సర్వమాత సామరస్యం కాపాడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. వరంగల్ డిక్లేరేషన్ తూ.చ తప్పకుండా పాటిస్తామన్నారు. కవులు రైతులకు కూడా 15 వేలు ఇస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యవసర వస్తుల ధరలను నియంత్రిస్తామన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వలేనోడు మహరాష్ట్ర వెళ్లి అక్కడ రైతులకు 24 గంటల కరెంటు ఇస్తాడంటా అని ఎద్దేవా చేశారు సంభాని. బీఆర్ఎస్ పచ్చి అబద్ధాల పార్టీ అన్నారు.
Read Also:TS Assembly: తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
బీజేపీ ఓ మతతత్వ పార్టీ దానిని ఓడించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ హయంలో గ్యాస్ ధర రూ.400 ఉంటే దానిని బీజేపీ అధికారంలోకి రాగానే రూ.1200 పెంచి పేదలపై పెను ధరాభారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున్న అప్పులు తెచ్చి రాష్ట్రంలో ఆడంబరాలకు తీసుకుపోతుందని తెలంగాణ సర్కారును ఉద్దేశించి ప్రసంగించారు. పేదల మీద పట్టింపు లేని ప్రభుత్వాలు పోవాల్సిన అవసరం ఉందని.. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని సంభాని చంద్రశేఖర్ అశాభావం వ్యక్తం చేశారు.