Kishan Reddy: సీఎం కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చకు ఎక్కడికి రమ్మంటే అక్కడు వస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై చర్చ జరగలేదని మండిపడ్డారు. ఈ సమావేశాలు కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లెందుకు, అసత్య ఆరోపణలు చేసేందుకు ఉపయోగించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ప్రసంగంలో కాంగ్రెస్ ను పొగడటం, బీజేపీని విమర్శించటం తప్పా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ మద్దతు కోసం అర్రులు చాస్తున్నట్లు కనిపించిందని ఆరోపించారు. కేసీఆర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కేసీఆర్ సిద్ధహస్తుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులను తిట్టి మళ్ళీ వాళ్ళతో జత కడుతున్నాడని మండిపడ్డారు. మజ్లిస్ ను పొగడని రోజు ఉండదని, కల్వకుంట్ల ఫ్యామిలీ, మజ్లిస్ బ్రదర్స్ ఒకరినొకరు పొగుడు కుంటారని ఆరోపించారు.
Read also: Kamareddy Master Plan: హైకోర్టు కీలక నిర్ణయం.. చెప్పకుండా చేయొద్దని తెలంగాణ సర్కార్ కి ఆదేశం
ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల లేక ప్రధాని వ్యతిరేక సమావేశాలని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ సభ్యులు పార్లమెంటుకు రారని, ఢిల్లీలో మాట్లాడాల్సినవి అసెంబ్లీలో మాట్లాడుతారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ఎందుకు చర్చ జరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలపై మాట్లాడనివ్వ లేదని, కుటుంబ పాలన పోవాలని తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీటింగ్స్ ను పొలిటికల్ మీటింగ్ గా మార్చారని ఎద్దేవ చేశారు. సభలో కేసీఆర్ కు భజన చెయ్యడం మోడీని విమర్శించారంటూ, కేసీఆర్ రాజీనామాకు తొందర ఎందుకంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్ భవన్ లో రాజీనామా లేఖ ఇవ్వక తప్పదని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హల్ చల్ గా మారాయి. ఈనేపథ్యంలో.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాలు విసిరారు. కేసీఆర్ తో చర్చకు సిద్దమని, దేశ ఆర్థిక పరిస్తితి పై కేసీఆర్ తో చర్చకు సిద్దమన్నారు. ప్రెస్ క్లబ్ , గన్ పార్క్, ప్రగతి భవన్ లో ఎక్కడ చర్చకు వస్తారు? అంటూ ప్రశ్నించారు. దేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Read also: 220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరుపు, దుప్పట్లు, బీరువా..
భారత్ బీడీపీలో 5 వ స్థానంలో ఉందని, 2027 లో జర్మనీ నీ దాటి 4 వ స్థానంలోకి చేరనుందని తెలిపారు. భారత దేశాన్ని అవమానించడం కల్వకుంట్ల కుటుంబానికి పరిపాటి అయిందని మండిపడ్డారు. ప్రజలకు జవాబుదారిగా ఉన్నా.. అనేక రంగాల్లో దేశం ముందుకు పోతోందని తెలిపారు. భారత్ ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకు వచ్చామన్నారు. శాసన సభలో నా గురించి మాట్లాడారని, కేంద్రమంత్రిగా కేంద్ర పథకాల్లో రాష్ట్ర సహకారం కోసం లేఖలు రాస్తే.. సీఎం నుంచి ఒక్క రిప్లై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం లేఖ అందింది అనే రిప్లై కూడా రాలేదని కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వీళ్ళు నన్ను విమర్శిస్తారు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల్లో చాలా ఉంటాయి అన్ని అమలవుతాయా? అంటూ ప్రశ్నించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేము రూపొందించలేదు గత ప్రభుత్వం రూపొందించిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ లో డి లిమిటీషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు జరుగుతుందని, 2026 లోనే తెలుగు రాష్ట్రాల్లో డి లిమిటీషన్ జరుగుతుందని.. జమ్మూకాశ్మీర్ ను ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేసి తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారనికి కేంద్రం చొరవ చూపడం పై స్పందించిన కిషన్ రెడ్డి.. ఇవన్ని పార్లమెంట్ లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
11 Crore Current Bill: ఇదెక్కడి పంచాయితీ సామీ..! పంచాయతీ కార్యాలయానికి 11 కోట్ల కరెంట్ బిల్లా?