జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘనస్వాగతం పలికారు అనంతరం వారిని సన్మానించారు. ఈనేపథ్యంలో.. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు.
గిరిజన రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా! అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజన బంధు ఏమైంది? అని ప్రశ్నించారు.
కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరవాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ , BRS డిసైడ్ అయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు పై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
బీబీసీ కార్యాలయంపై ఇవాళ ఐటీ దాడులు సంచలనంగా మారింది. దీనిపై ఐటీ పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆశక్తి కరంగా మారింది. ఏమి ఆశ్చర్యం అంటూ స్మైలీ ఇమోజీని పెట్టారు.