Bandi sanjay: సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ అంటూ ఛాలెంజ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని గ్రామంలో జైలు నుండి విడుదలైన కమలాపూర్ కార్యకర్తలను పరామర్శించిన బండి సంజయ్ ఈ వాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోటార్లకు మీటర్లు పెడతామన్నది కేసీఆరే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ఇంతవరకు డీపీఆర్ ఇవ్వని మాట నిజం కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పే అని ఆరోపించారు. నిరూపించేందుకు నేను సిద్ధం.. బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. దమ్ముంటే డేట్, టైం, వేదిక ఫిక్స్ చేసి నా సవాల్ ను స్వీకరించాలని అన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.
Read also: Suspicion: అనుమానంతో నిండుప్రాణం బలి.. బాబాయ్ పై కొడవలితో దాడి
కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వాళ్ల అంతు చూస్తామన్నారు. బిచ్చమెత్తుకునేలా చేస్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతాం రుణాలివ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు బండి సంజయ్. అయినప్పటికీ కేంద్రమే మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ బెదిరిస్తోందంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడం సిగ్గు చేటన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపైనా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధుల విషయంలో ముఖ్యమంత్రి చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. ఈ మూడు అంశాలపై బహిరంగ చర్చకి రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే డేట్, టైం ఫిక్స్ చేసి నా సవాల్ ను స్వీకరించాలని ఛాలెంజ్ విసిరారు.
Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు