సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పచ్చి ఫ్యూడల్ భావజాలాన్ని.. దొరతనాన్ని తెలియజెప్పుకొని.. పేదల మీద కసి తీర్చుకునే విధానంలో భాగమే ధరణి అని ఆరోపించారు. సర్కారు దుర్మార్గానికి, దాష్టకానికి రాష్ట్రంలో వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. బిల్లలు రాక సర్పంచులు, కాంట్రాక్టర్లు.. ఉద్యోగాలు రాక యువత, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేశారని, 24 గంటల మూడు ఫేజ్‌ల కరెంటు వస్తుంది అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు.
Also Read : Javed Akhtar: పాక్‌లో జావెద్.. దాయాది దేశంలోనే 26/11 ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు
ఈ ప్రభుత్వాన్ని కాపాడే శక్తి దేవుడు కూడా కోల్పోయాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, 2023లో గెలవబోయేది బీజేపీనేని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాయన్న ఒక దళిత బిడ్డ అని, వరుసగా ఐదు సార్లు గెలిచారని, అధికారపార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలేదని ఆయన అన్నారు. కేసీఆర్ దొర అహంకారం బయటపడిందని ఈటల అన్నారు. దళితుల పట్ల ఆయన వైఖరి తేటతెల్లం అయ్యిందన్న ఈటల.. ఆయన అవమానపరిచింది సాయన్నను కాదు దళిత జాతిని అన్నారు.
Also Read : UPSC Civil Services Exam: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు అప్లై చేశారా.. గంటలే గడువు!