Srinivas Goud : తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, క్రీడ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్ కు రాష్ట్ర క్రీడా శాఖ తరపున హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ కు రాష్ట్ర క్రీడా పర్యాటక & సంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ తో కలసి అందజేశారు.
Also Read : Vishnu Kumar Raju: కన్నాను కలిసిన విష్ణుకుమార్ రాజు.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు
Also Read
- Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో క్రీడా స్టేడియం ను నిర్మిస్తున్నమన్నారు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి క్రీడా పాలసీ నీ రూపొందించామన్నారు. క్రీడా పాలసీని వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా చర్యలు చేపట్టామన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తెలంగాణ రాష్ట్రంలో రూపొందించామన్నారు.. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోoదన్నారు. అలాగే, క్రీడారంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా క్రీడా పాలసీని రాష్ట్రంలో రూపొందించామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా రూపొందిస్తున్నామన్నారు.
Also Read : Mukaab: అద్భుత కట్టడాలకు కేరాఫ్ అరబ్ కంట్రీ.. వావ్ ఈ సారి డిజైన్ మామూలుగా లేదు
తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ స్థాయిలో నిలుపుతున్న నిక్కత్ జరీన్ కు సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు 2 కోట్ల రూపాయల నగదు బహుమతి ఇప్పటికే అందించామన్నారు. త్వరలో గ్రూప్ -1 పోస్ట్ అయిన డీఎస్పీ ఉద్యోగాన్ని నిక్కత్ జరీన్ కు అందజేస్తామన్నారు. ఆమె సూచనల మేరకు ఇంటి స్థలాన్ని ఆమె తండ్రి మహమ్మద్ జమిల్ అహ్మద్ కు అందించామన్నారు. ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ ను ఈ సందర్భంగా అభినందించారు. ఇప్పటికే క్రీడా శాఖ తరపున ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈషా సింగ్ కు 2 కోట్ల రూపాయల నగదు బహుమతి తో పాటు 600 గజాల విలువైన ఇంటి స్థలం జూబ్లీహిల్స్ లో కేటాయించి అందుకు సంబంధించిన పత్రాలను అందించమన్నారు. షూటింగ్ క్రీడాకారిని ఈషా సింగ్ కు గ్రూప్ – 1 స్థాయి ఉద్యోగాన్ని త్వరలో అందజేస్తామన్నారు. వీటితోపాటు పద్మశ్రీ కిన్నెర మొగలయ్య కు ఒక 1 కోటి రూపాయలు నగదు తో పాటు 600 గజాల విలువైన ఇంటి స్థలాన్ని అందజేశామన్నారు.
ఈ సందర్భంగా నిక్కత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ… బాక్సింగ్ క్రీడలో అద్భుతమైన ప్రతిభ ను కనబరుస్తున్న నిక్కత్ జరీన్ ప్రతిభ ను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిచి భోజనం పెట్టి అభినందించారన్నారు. అలాగే, రెండు కోట్ల రూపాయల నగదు బహుమతి తో పాటు, హైదరాబాద్ లోని ఎంతో విలువైన జూబ్లీహిల్స్ లో ఇంటి స్థలాన్ని కేటాయించినందుకు, డీఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ , క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సల్తానియా గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!