హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్కు పోటీగా హనుమకొండ ఉండబోతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రకాలుగా అభివృద్ధి చెందిందని.. మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కేసీఆర్, కేటీఆర్లకే దక్కుతుందన్నారు.
ఏ శాఖలో ఎన్నిఖాళీలున్నాయో 24గంటల్లోగా చెప్పు బండి సంజయ్ అంటూ టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మోడీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారని మండిపడ్డారు. 22 కోట్ల 6 లక్షల అప్లికేషన్ లు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసినట్టు మోడీ చెప్పారని తెలిపారు.
నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూములపై బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేక రాశారు.