MLA Muthireddy: జనగామ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి సొంత కూతురే.. పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమి తీసుకున్నారని కూతురు తుల్జా భవానీ రెడ్డి కూడా తన తండ్రి ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అయితే దీనిపై
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. నా పైన ప్రత్యర్ధులు అనేక అభియోగాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి బతుకమ్మ కుంటలో కబ్జా చేశారని అనగా, మా కార్యకర్తలు అక్కడ టెంట్ వేసి మరి కూర్చున్నారు కానీ ఎవరూ రాలేదు. నాపైన మా ముఖ్యమంత్రి కి కూడా ఆరోపణలు చేశారన్నారు. కానీ అవన్నీ పట్టించుకోకుండా 2014 2018 లో నన్ను ప్రజల వద్దకు పంపించారని తెలిపారు. అందరికి కుటుంబాలు ఉన్నాయని గుర్తు చేశారు.
Read also: DVV Entertainment: బిల్డప్ ఇస్తే తొక్క తీస్తా… సూపర్ రిప్లై ఇచ్చారు మావా
కానీ నా బిడ్డను ప్రత్యర్ధులు నాపై ఈ విధంగా ఉసిగొలిపారు ఈ విధంగా చేయిస్తున్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని అన్నారు. చేర్యాల లో సర్వే. నే0. 1402 లో 1200 గజాలు తన కూతురిపై రిజిస్టర్ చేసి ఉంది, ఉప్పల్ PS పరిధిలో మా బిడ్డపై 125 నుండి 150 గజాల వరకు ఉన్నది ఇందులో ఏలాంటి ఫోర్జరీ జరగలేదని స్పష్టం చేశారు. ఇది కూడా కేవలం నా కుమారుడు దానిపై కిరాయి నామ మాత్రమే నాకు తెలియకుండానే మార్చారని తెలిపారు. ఇందులో ఎలాంటి ఫోర్జరీ ఏమి జరగలేదని అన్నారు. ఆ ఆస్తి తన కూతురి పెరుమీదనే ఉన్నదని తెలిపారు. కిరాయి కూడా మా అమ్మాయికే వెళ్తుందని స్పష్టం చేశారు. నేను ఏ తప్పు చేసిన ప్రజలు శిక్ష వేస్తారని అన్నారు. మా అధినేత మా ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నంత వరకు నియోజకవర్గంలో ఉంటానని తెలిపారు. మా రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు అనేది మా అధినేతకు తెలుసని అన్నారు. ధర్మ, ధర్మాలు ప్రత్యర్ధులకు వదిలేస్తున్నానని మాట్లాడారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ తో కలిసి పని చేసానని గుర్తు చేశారు. 2009 నుండి 2014 వరకు 5 సంవత్సరాలు జనగామ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం చేసానని తెలిపారు. జనగామ నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు కోసం అప్పుడు అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. నా పదవి అడ్డుపెట్టుకుని ఏ అధికారిపై దురుసుగా ప్రవర్తించ లేదని స్పష్టం చేశారు.
Vande Bharat: ఏమైంది రా.. ఎందుకురా రాళ్లదాడులు? ఎవరిమీద కోపం