తెలంగాణలో మంత్రి శ్రీనివాస్ యాదవ్, గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశం కోసం సకల సంపదలను, జీవితాన్ని త్యాగం చేసి చివరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంక గాంధీ పైన తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన దూరహంకారనికి నిదర్శనం అని కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరికలను తీర్చిన సోనియమ్మ బిడ్డ ప్రియాంక గాంధీపైన విమర్శలు చేయడం దారుణమన్నారు.
Also Read : Abhiram: మొత్తానికి ‘అహింస’ రిలీజ్ డేట్ లాక్ చేశారు!
రేవంత్ రెడ్డిపైన తలసాని వ్యక్తిగత విమర్శలు ఆయన చేతగాని, చేవలేని తనానికి పరాకాష్ట అంటూ మల్లు రవి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి యువకుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారో చెప్పాలి.. చెప్పడానికి ఏమి లేని వాళ్లే వ్యక్తిగత విమర్శలు చేస్తారని మంత్రి తలసానిపై మల్లురవి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Polygaymy: అస్సాం సీఎం సంచలన నిర్ణయం.. “బహుభార్యత్వం” నిషేధం వైపు అడుగులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి తలసాని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఖండించారు. నిన్ను పిసక కుండానే ప్రాణం పోతది అంటూ కామెంట్స్ చేశారు. తలసానిది బానిస బతుకు.. బతికిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వరు కానీ.. సచ్చినోడికి స్మశాన వాటిక కడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ ని పొగడడం తప్పితే అంతకు మించిన బతుకు మీకు లేదు అంటూ తలసానిపై అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
Also Read : Chatrapathi: శ్రీనివాస్ హిందీలో పెద్ద స్టార్ అవుతాడు: వి. వి. వినాయక్
సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదని మహేష్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సీఎం అయినా..నువ్వు మంత్రివి అయినా.. అది గాంధీ కుటుంబం భిక్ష.. తెలంగాణ కోసం తలసాని ఇంట్లో ఎవరైనా త్యాగం చేశారా..?అంటూ కాంగ్రెస్ నేత మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తలసానికి తలకాయ ఉన్నాదా..? అంటూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావు.. పాన్ షాప్ దగ్గర గుట్కాలు తింటూ ఉన్నావు.. తలసాని.. రేపటి నుంచి నిన్ను ఎన్ఎస్యూఐ అడ్డుకుంటది అని బల్మూరి వెంకట్ అన్నారు. వెంటనే ప్రియాంక గాంధీ, రేవంత్ రెండ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. కేటీఆర్ తెలంగాణ మీ గడి కాదు.. మీరు గడి అనుకుంటే.. ఆ గడిలను బద్దలు కొడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు.