CM KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వెళ్లనున్నారు.
Off The Record: తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా అధికార బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జనానికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది BRS. ఇటీవల జరిగిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గెలుపు కోసం ఏం చేయాలనేదానిపై నేతలకు…
కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్గొండలో నిరుద్యోగ దీక్షకు వచ్చారు అని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అంతా ఒకటే అన్నారు, కానీ వేరు వేరుగా వచ్చారు.. మంత్రి గురించి అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని భూపాల్ రెడ్ది ఎద్దేవా చేశారు.
Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ సభలో మాజీ సీఎల్పి నేత జానారెడ్డి పాల్గొన్నారు. సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను, నిరుద్యోగులను చూస్తుంటే మా హృదయాలు పరవశిస్తున్నాయని ఆయన అన్నారు.