Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!
- పశ్చిమాసియాలో భీకరంగా యుద్ధం
- ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య దాడులు
- ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌లో ఖమేనీ పాలనే అంతంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి బీభత్సం సృష్టించాయి. గత నెల 28 నుంచి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించాయి. ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఇలా దాడులు.. ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది.
అయితే ఇదంతా ఒకెత్తు అయితే.. ఇరాన్‌కు వెన్నెముక లాంటి ప్రాంతం వైపు మాత్రం ఇరు దేశాలు కన్నెత్తి కూడా చూడలేదు. ఇందుకు సంబంధించిన కీలక సమాచారం అంతర్జాతీయ విశ్లేషకులు వెలుగులోకి తీసుకొచ్చారు. అదేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
Also Read
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
- Trump Hair: హెయిర్‌స్టైల్ మార్చేసిన ట్రంప్.. నెటిజన్లు కామెంట్లు
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం
ఖార్గ్ ద్వీపం..
ఖార్గ్ ద్వీపం.. ఇది ఇరాన్‌కు 25 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది ద్వీపం కాదు.. ఇరాన్‌కు ఆయువు పట్టు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిది. అలాంటి ద్వీపం జోలికి మాత్రం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రెండు కూడా కన్నెత్తి చూడలేదు. వాస్తవంగా ఖార్గ్ ద్వీపాన్ని ధ్వంసం చేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది. ఇరాన్ బలమంతా ఈ ద్వీపంపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటిది ఇరు దేశాలు కూడా దానివైపే చూడనేలేదు. నిరంతరం ఖమేనీ ప్రభుత్వం కూలిపోవడంపైనే రెండు దేశాలు దృష్టి పెట్టాయి కానీ.. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నాశనం అయ్యే ఖార్గ్ ద్వీపంపై మాత్రం దృష్టి పెట్టలేదు.
ఇప్పటికే ఇరాన్‌పై చేస్తున్న దాడులతో చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. హర్ముజ్ జలసంధిలో వందలాది ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయి ఉన్నాయి. ఎటు కదలలేని పరిస్థితులు దాపురించాయి. ఇలాంటి తరుణంలో ఖార్గ్ ద్వీపాన్ని గనుక అమెరికా ముట్టుకుంటే ప్రపంచ దేశాలకు చమురు సంక్షోభం తీవ్రస్థాయిలో తలెత్తి అల్లాడిపోయే పరిస్థితులు దాపురిస్తాయి. ఈ కారణంతోనే అమెరికా ఆ ద్వీపం జోలికి పోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఓ వైపు యుద్ధం జరుగుతున్నప్పటికీ అక్కడ యథావిధిగా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని ఫైనాన్సియల్ టైమ్స్ నివేదించింది. ప్రతి రోజు 7 మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేస్తోంది. విదేశాలకు విక్రయించే 10 బ్యారెళ్ల చమురులో తొమ్మిది బ్యారెళ్ల చమురు ఇక్కడ నుంచే వెళ్తాయి. అంటే అంత ప్రముఖ్యమైంది ఈ ద్వీపం. ఈ ద్వీపానికి దక్షిణ భాగంలో డజన్ల కొద్దీ నిల్వ ట్యాంకులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
అయితే ఆయిల్ ట్యాంకర్ల రవాణా మాత్రం ఆగిపోయింది. ట్యాంకర్లు మలక్కా జలసంధికి చేరుకునే మార్గంలో లొకేషన్ సిగ్నల్స్‌ను ప్రస్తుతం ఇరాన్ నిలిపివేసేసింది. దీంతో రవాణా ఆగిపోయింది. ఈ కారణంతోనే ప్రస్తుతం చమురు సంక్షోభం తలెత్తింది. ఇక ఈ ద్వీపాన్ని గనుక అమెరికా ముట్టుకుంటే… వెంటనే గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు కేంద్రాలను ఇరాన్ లక్ష్యం చేసుకుంటుందన్న కారణాలతోనే అగ్ర రాజ్యం దాని జోలికి పోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే రెండు దేశాలు కూడా ఖమేనీ ప్రభుత్వం కూలిపోవడంపైనే దృష్టిపెట్టాయి కానీ.. ఆర్థిక వనరును దెబ్బ కొట్టాలనే ఆలోచన లేదు.
ఇక ఖార్గ్ ద్వీపం కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. 1960 నుంచి ఇరాన్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. దీన్ని అమెరికాకు చెందిన అమెకో కంపెనీనే నిర్మించిందని నివేదికలు అందుతున్నాయి. చమురు రవాణా ఎక్కువ భాగం ఇక్కడ నుంచే ప్రపంచ దేశాలకు వెళ్తుంటాయి. ప్రస్తుతం ఖార్గ్ ద్వీపంలోని చమురు కేంద్రం చాలా చురుగ్గా పని చేస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇరాన్ మాత్రం హర్ముజ్ జలసంధిని మూసేయడంతో ఎక్కడికక్కడే ట్యాంకర్లు ఆగిపోయి ఉన్నాయి. దీంతోనే చమురు సంక్షోభం తలెత్తింది. ఇక త్వరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ యుద్ధం ముగిస్తే.. పరిస్థితులు తిరిగి నార్మల్ అయ్యే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!