మహబూబ్‌గర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు తరలివచ్చారు. అయితే.. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ.. కరువు తప్ప అభివృద్ధి తెలియని జిల్లా పాలమూరు అని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు వలసల జిల్లాగా పాలమూరును మార్చారన్నారు. డెబ్భై ఏండ్ల పాలనలో కరువు, వలసలు మాత్రమే పాలమూరు జిల్లా చూసిందని, ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతుందన్నారు.
Also Read : Madhave Madhusudana: ‘సైయారా.. సైయారా…’ సాంగ్ లాంచ్ చేసిన బ్రహ్మనందం!
అంతేకాకుండా.. ‘పెండింగ్ ప్రాజెక్ట్ లను సీఎం కేసీఆర్ పూర్తి చేశారు.. పాలమూరు లో వేరే రాష్ట్రం నుండి కూలీలు వచ్చి నాట్లు వేస్తున్నది నిజం కాదా? సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ లో మొట్టమొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చేశారు.. రేవంత్ వ్యవహారం ప్రజలందరికీ తెలిసిపోయింది.. రేవంత్ తనకుతాను గొప్ప నాయకుడు అని ఊహించుకుంటున్నాడు. పిచ్చి మాటలు మానుకోవాలని రేవంత్ ను హెచ్చరిస్తున్నాను.. చట్టం అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ రాజకీయాలు చేస్తాడు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఎంపీ పదవి తీసేస్తే చప్పుడు లేదు… నరేంద్రమోడీ అసమర్ధ ప్రధాని…. ధరల పెరుగుదల, రూపాయి విలువ పడిపోవడం నరేంద్రమోదీ పనితనం.
Also Read : BJP Worker: గుజరాత్‌లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య.. బైక్‌పై వచ్చి కాల్పులు
పెట్రోల్ ,డీజిల్ ధర డబుల్ చేసిన ఏకైక ప్రధాని మోడీ… మన ఎల్ ఐ సి డబ్బులు అదాని కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు.. ప్రజల డబ్బును ప్రైవేట్ కంపెనీ లో పెట్టడానికి మోడీ ఎవరు? ప్రైవేట్ కంపెనీలకు లబ్ది చేకూరుస్తూ వారు ఇచ్చిన డబ్బులతో ఎమ్మెల్యే లను కొంటున్నాడు… కేసీఆర్ మన సంక్షేమం కోసం డబ్బులు పంపిస్తుంటే మోడీ మన డబ్బులు తిరిగి తీసుకుంటున్నాడు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.