సిద్దిపేటలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటించారు. వెంకటాపూర్, ఇబ్రహీంపూర్ గుర్రాలగొంది గ్రామాల్లో భూ సంబంధిత పీఓటీ కేసులు పరిష్కరించి ధృవీకరణ పత్రాలు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల్లో 26 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, సద్దితిన్న రేవు తలవాలన్నారు.
Also Read : Manipur Violence: మణిపూర్‌లో హింసాకాండ.. ఇండో-మయన్మార్ సరిహద్దులో వైమానిక నిఘా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వచ్చాక ఏలా మారిందో.. మీరే గమనించాలన్నారు మంత్రి హరీష్ రావు. మీరు కబ్జాలో ఉన్న భూమిపై సర్వహక్కులు కల్పించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. పన్నుల రాబడుల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 2022-23 సంవత్సరంలో రూ.72, 564 కోట్లు వచ్చాయని ఆయన వెల్లడించారు. దేశంలోనే అభివృద్ధికి సూచికగా తెలంగాణను నిలబెట్టాలన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంక్షేమ పథకాలు నిర్వహిస్తోందని చెప్పారు. రాష్ట్ర ఆదాయంలోని ప్రతి రూపాయిని పేద ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Also Read : Ponnam Prabhakar : యువత కాంగ్రెస్‌తో కలిసి రండి.. కేసీఆర్ ప్రభుత్వం మీద కొట్లాడదాం