మా హయాంలో లక్ష ఆరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాము.. కానీ, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే అసెంబ్లీని వాయిదా వేసుకొని వెళ్లారు.. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇరవై నెలల్లో 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు అని హరీష్ రావు వెల్లడించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్యెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేశారు.
అనగనగా ఒక రాజకీయ నాయకుడు. ఆయన పేరు ధర్మపురి శ్రీనివాస్. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేశారాయన. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేస్‌లో ఉన్నారు. అప్పట్లో అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వెళ్ళి సోనియాగాంధీని కలవగలిగిన స్థాయి ఆయనది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు మారిపోయి బీఆర్ఎస్లో చేరినా... ఫైనల్‌గా తిరిగి కాంగ్రెస్ గూటికే చేరారు డీఎస్. ఆయన ఇద్దరు కొడుకుల్లో... సంజయ్ కాంగ్రెస్‌లో, అర్వింద్ బీజేపీలో ఉన్నారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్ కు…
Jupally Krishan Rao : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ, గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. తలతిక్క పనులే బీఆర్ఎస్ను తిరస్కరించేలా చేశాయి అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఇలాంటివి ఆదర్శ పాలనకు దూరమైన చర్యలు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలకే అవమానం అని…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడో కొత్త రకం చర్చ మొదలైందట. పార్టీలో అందరిదీ ఒక లైన్ అయితే... జగ్గారెడ్డిది మరో లైన్ అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. గాంధీభవన్‌లో ఇటీవల పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఆ మీటింగ్‌లో జగ్గారెడ్డి అన్న మాటల గురించే ఇప్పుడు చర్చ అంతా. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, అమలు జరుపుతున్న సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో బాగా ప్రచారం జరగాలంటే... కార్యకర్తలని సంతోషపెట్టడం ముఖ్యమని సూచించారట ఆయన.
మరోసారి తెలంగాణలో ఆంధ్రా బిర్యానీని ఉడికించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంత వంటకాలను, అలవాట్లను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎండార్స్ చేస్తూ కవిత తాజాగా వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఉద్యమకారులను ఉద్దేశించి ఆనాడు కేసీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రా ప్రాంతంలో వండే బిర్యానీని పేడతో పోల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో కేసీఆర్ మాటల్ని ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు తీవ్రంగా నిరసించారు. సోషల్ మీడి
MLC Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. బోనాల పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇప్పటివరకు 18 నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. అయినా రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మొదలవ్వలేదు. కేసీఆర్ హయంలో తీసుకున్న అప్పులకు…
తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అలంపూర్ నియోజకవర్గం రాజకీయ మలుపుల్లో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటోంది. ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేది.... టికెట్ల పంపిణీ వరకు సస్పెన్స్ గానే ఉంటోంది గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల నుంచి. ఈ క్రమంలో.... రెండు సార్లు అలంపూర్ ఎమ్మెల్యేగా పని చేసిన అబ్రహం... ఈసారి పార్టీ మారి కాషాయ కండువా కప్పుకోబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని,
రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించే అధికారం ఎవ్వరికి లేదని... 2021 హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నా ఫోన్ టాప్ చేశారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యారైన ఆయన సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను ఓడగొట్టాలని ప్రయత్నలు చేశారని.. తాను ఎవ్వరితో మాట్లాడుతున్నానో తెలుసుకున్నారన్నారు.