Konda Surekha vs KTR : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకోబడగా, BNSS సెక్షన్ 222 r/w 223 ప్రకారం నేరాన్ని స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల సమర్పించిన వాదనలను కోర్టు సమర్థించింది. సాక్ష్యులు (PW1 నుండి PW5) ఇచ్చిన వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు గుర్తించింది.
కొండా సురేఖ తరపు వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. రేఖ తరపు న్యాయవాది లేవనెత్తిన పలు అంశాలను కోర్టు తిరస్కరించింది. ఫిర్యాదు ఊహాగానాలపై ఆధారపడిందన్న వాదనను అంగీకరించలేదు. పెన్‌డ్రైవ్‌కు 65-B సర్టిఫికేట్ అవసరం అనే వాదనను ఈ దశలో అప్రస్తుతమని తేల్చింది. విచారణ సమయంలో అది పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
Vizag Food Safety Raids: కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
సురేఖ చేసిన వ్యాఖ్యలు మీడియాలో ముందే వచ్చాయన్న వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఈ పరిశీలనలన్నింటి తర్వాత, నాంపల్లి కోర్టు 2025 ఆగస్టు 21 లోపు క్రిమినల్ కేసు నమోదు చేసి, నిందితురాలికి నోటీసు జారీ చేయాలని పోలీసులకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం (క్రిమినల్ పిటిషన్ నెం. 5670/2024) ప్రకారం కోర్టుకు ఈ అధికారం ఉందని కూడా తీర్పులో పేర్కొంది.
ఈ తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కేటీఆర్ ఆరోపణలు నిజమా కాదా అన్నది విచారణలో తేలాల్సి ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశం మంత్రి సురేఖకు పెద్ద షాక్‌గా మారింది. ఇకపై కేసు న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్తుందో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mahavatar Narsimha: భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ చిత్రంగా మహావతార్ నరసింహ!