బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పీసీసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత బీఆర్ఎస్ నాయకురాలుగా లెటర్ రాసిందా, జాగృతి నాయకురాలుగా రాసిందా అని ప్రశ్నించారు. మేము బీసీల కోసం వాగ్దానం చేసిన రోజు కవిత తీహార్ జైల్లో ఊసలు లెక్కపెడుతుంది అని ఎద్దేవా చేశారు.
అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో సంక్షోభం.. ఒకవైపు సొంత కూతురు ధిక్కార స్వరం, మరోవైపు మేనల్లుడు హరీష్‌రావు అలక. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నోటీసులు, కొడుకు కేటీఆర్ ఏసీబీ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇలా ఎటు చూసినా కేసీఆర్‌కు ఇబ్బందికర పరిస్థితులే. ఆయనకున్న నమ్మకాల కోణంలో చెప్పాలంటే.. గ్రహాలు కలిసిరాలేదు.
తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరో జల వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ ఎపిసోడ్‌ని సీరియ్‌గా తీసుకోవాలని భావించింది బీఆర్ఎస్. దానికి సంబంధించి ఆ పార్టీ నేత హరీష్‌రావు వరుస మీడియా సమావేశాలు పెట్టి... తెలంగాణ, ఆంధ్ర నీటి పంపకాల అంశాన్ని మరోసారి తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ మధ్య దోస్తానా .. అంటూ వాళ్ళిద్దరికీ ముడిపెట్టి రాజకీయ అంశంగా మలచాలని భావించిందట గులాబీ పార్టీ.
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్ట్ బనకచర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మొద్దు నిద్ర లేపింది బీఆర్ఎస్ అన్నారు. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తిరస్కరించే వరకు అలుపెరుగని పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ.. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని చెప్పిన రేవంతుకు.. మిగులు జలాల్లోనూ తెలంగాణకు వాటా ఉంటుందని జ్ఞానోదయం చేసింది తమ పార్టీ అని ఆయన…
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు.
తెలంగాణ హక్కులు కాపాడాలనేది మా ఆలోచన అన్నారు. అయితే, కేసీఆర్, హరీష్ రావుల దగ్గరే తొమ్మిదిన్నరేళ్ల పాటు నీటి పారుదల శాఖ ఉంది.. వాళ్ళ మీద పెట్టిన నమ్మకం వమ్ము చేశారు.. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకి గుది బండలాగా మారింది.. నికర జలాల మీద కేటాయింపుల్లో స్పష్టత ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Madhusudhana Chary: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు అనే మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి తెలిపారు. ఆయనకు రాజకీయలా పట్ల అవగహన లేదని అర్ధం అవుతుంది.. అతడి మాటలతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపాలి అన్నారు.
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ శాతం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. అయితే... తెలంగాణలో వ్యవహారం కాస్త డిఫరెంట్‌గా ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. మొదట ఈ ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకుని...కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది బీఆర్ఎస్. కానీ... ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి రివర్స్ అటాక్ మొదలవడంతో మేటర్ రసకందాయంలో పడిందని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో సమావేశం పెట్టింది సర్కార్.
మా హయాంలో లక్ష ఆరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాము.. కానీ, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు అని పేర్కొన్నారు. దానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే అసెంబ్లీని వాయిదా వేసుకొని వెళ్లారు.. మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇరవై నెలల్లో 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు అని హరీష్ రావు వెల్లడించారు.