KTR: 50 సార్లు ఢిల్లీకి సీఎం.. రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్..
- హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు..
- తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారు..
- రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.. కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు: మొదటి పని – ఫ్లైటు టికెట్ బుక్ చేయడం!, రెండో పని – ఢిల్లీకి పోవడం!, మూడో పని – ఖాళీ చేతులతో తిరిగి రావడం! అని కేటీఆర్ రాసుకొచ్చారు.
Read Also: Tesla Fined: టెస్లా కారులో ఆటో పైలట్ తప్పిదం.. రూ.2,100 కోట్ల జరిమానా
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఇక, రైతన్నలు ఇబ్బందులను తట్టుకుని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేదు.. రైతులు పొలాల్లో జల్లడానికి యూరియా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. సాగు నీళ్లు రావు.. తాగునీళ్లు లేవు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎత్తిపోతల మరమ్మతు పనులు జరగకుండా అడ్డుకుంటూ తెలంగాణకు ద్రోహం చేస్తున్నామన్న సోయి లేదు అని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు.. రెండు లక్షల ఉద్యోగాల ఊసు లేదు .. జాబ్ క్యాలెండర్ల జాడ లేదు.. రుణమాఫీ కాలేదు- రైతు భరోసా రాలేదు.. తులం బంగారం ఊసు లేదు .. రూ.4 వేల ఫించన్ జాడ లేదు.. గురుకులాల గోడు పట్టదు – గురుకుల విద్యార్థుల ఆకలి కేకలు వినపడడం లేదు.. కానీ రేవంత్ రెడ్డి 3 రోజుల్లో 3 ఫ్లైట్‌లు ఎక్కుతున్నాడు .. దిగుతున్నాడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Russia vs America: అమెరికాకు రష్యా హెచ్చరిక.. మా దగ్గర కూడా అణు జలాంతర్గాములున్నాయి..!
ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. 50 సార్లకు చేరిన హస్తిన యాత్ర రేవంత్ రెడ్డి.. తెచ్చింది ఏమీ లేదు! అని కేటీఆర్ ఆరోపించారు. శుష్కప్రియాలు .. శూన్య హస్తాలు, అయిననూ పోయి రావలె హస్తినకు!.. కానీ ఢిల్లీ యాత్రలతో మన రాష్ట్రానికి వచ్చిందేమిటి? అని ప్రశ్నించారు. నో ప్రాజెక్ట్, నో ఫండింగ్, నో ప్యాకేజీ.. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి కావాలి.. ఢిల్లీకి యాత్రలు చేసే టూరిస్ట్ సీఎం కాదు అని మండిపడ్డారు.
50 TRIPS – ZERO RESULTS !
హస్తిన యాత్రలో అర్ధశతకం సాధించిన రేవంత్!
తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా…✈️ ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి..
ఈయన ఢిల్లీ యాత్రలకు .. తెలంగాణకు ఏ సంబంధం లేదు.
కాంగ్రెస్ పాలన చేపట్టాక రేవంత్ చేసిన మూడు పనులు:
మొదటి పని –… https://t.co/FaCLYRgY0n
— KTR (@KTRBRS) August 2, 2025
తాజావార్తలు
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు