నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల టైంలో మర్రి జనార్దన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపిస్తూ.. దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ ( సోమవారం ) హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక వివాదంపై నేడు తీర్పును వెల్లడించింది.
Read Also: Atharvaa:అమలా పాల్ ఒక చెత్త హీరోయిన్… యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
అయితే, 2018లో నాగం జనార్దన్ రెడ్డిపై మర్రి జనార్దన్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే మర్రి జనార్దన్ రెడ్డి ఈసీకి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ 2019లో నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అఫిడవిట్‌లో కొన్ని వివరాలను మర్రి జనార్థన్ రెడ్డి దాచి పెట్టారని నాగం జనార్థన్ రెడ్డి ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాని కోరారు. ఇక, దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తన పిటిషన్‌లో ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు చూపించలేదని హైకోర్టు పేర్కొంది.
Read Also: Bhola Shankar: డిజాస్టర్ భోళా.. పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్న క్రికెట్ ఫ్యాన్స్
దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నిక రద్దు చేయాలన్న నాగం జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది.. హైకోర్టు తీర్పుపై నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి స్పందిస్తూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదు.. అందుకే హైకోర్టు సరైన తీర్పును ఇచ్చిందని ఆయన పేర్కొన్నాడు. నాపై కుట్రతోనే నాగం జనార్థన్ ఈ పిటిషన్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు.