నేడు (సోమవారం) కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి అమృత నగర్ తండా.. దీన్ దయాల్ నగర్.. జింకలవాడ.. హెచ్పి రోడ్.. సమతా నగర్.. వెంకటేశ్వర నగర్.. భవాని నగర్.. కార్మిక నగర్.. శివాలయం హాట్స్ మీదుగా పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేసిన అభివృద్దిపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
Read Also: Rahul Gandhi: రామేశ్వర్తో కలిసి భోజనం చేసిన రాహుల్.. ఫొటోలు వైరల్
ఒకప్పుడు తండాల్లో మంచినీటికి ఎంతో ఇబ్బంది పడే వారమని.. ఇప్పుడు గల్లీ గల్లీకి రోడ్లు వేసి.. మంచినీరు అందించి 24 గంటలు విద్యుత్తు సదుపాయం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ వంటి పథకాలు అందిన లబ్ధిదారులు ఈ పాదయాత్రలో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును సన్మానించారు..
Read Also: MLC Kavitha: గాయకులతో కలిసి బతుకమ్మ పాటను పాడిన కవిత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఫతేనగర్ లోని నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాలైన దీన్ దయాల్ నగర్.. అమృత నగర్ తండా, కార్మిక నగర్ మొదలగు ప్రాంతాల్లో ప్రజలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు అప్లై చేసుకున్నారని.. అయితే అతి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందించే బాధ్యత నాదని వారికి హామీ ఇచ్చారు.. 60 ఏళ్లుగా ఎంతో మంది పాలకులు పరిపాలించినా కేవలం 9 ఏళ్లలో ఎన్నో సమస్యలు తీర్చిన ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని పొరపాటున అధికారం వేరే పార్టీలకి అప్పజెప్పితే రాష్ట్రం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హితబోధ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నేడు హైదరాబాద్ అమ్మలా అందరిని ఆదుకుంటుందని ఆయన గుర్తు చేశారు…