Kishan Reddy: కాంగ్రెస్ కు ఓటు వేసిన BRS కి వేసినట్టే అని, ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టేనని.. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉందని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర సమర యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రజాకార్లు, నిజాం వ్యతిరేకంగా వేలాది మంది పోరాటం చేశారని అన్నారు. ఈ ప్రాంతం భారత దేశంలో విలీనం కావాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చి వంద యేళ్లు అయ్యే లోపు దేశంలో పేదరికం, నిరుద్యోగం,కుటుంబ పాలన, అవినీతి ఉండకూడదని, దేశం విశ్వగురువు కావాలన్నారు. ఏ లక్ష్యం కోసం నిజాంకు వ్యతిరేకంగా, తెలంగాణ కోసం పోరాటం చేశామో ఆ లక్ష్యం నెరవేరుతుంద ఆలోచించుకోవాలని తెలిపారు. 9 సంవత్సరాల జరిగిన దోపిడీ, అవినీతి, అప్రజాస్వామిక పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల మీద పడకుండా చూడాలని, ఆదమరచి ఉండకూడదన్నారు.
Read also: Asia Cup 2023: ఆసియా కప్‌కు నేపాల్ జట్టు ప్రకటన.. ఐపీఎల్ స్టార్‌కు చోటు! కెప్టెన్‌గా రోహిత్
కల్వకుంట్ల కుటుంబం మళ్ళీ అధికారంలోకి వస్తె తెలంగాణ పూర్తిగా అధోగతి పాలు అవుతుందని అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి… మద్యం ఏరులై పారిస్తున్నారని తెలిపారు. మెజారిటీ మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల కుటుంబం చేతిలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్ కల్వకుంట్ల డైనింగ్ టేబుల్ మీద నిర్ణయించబడుతుందని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు దోపిడీ చేసింది, అక్రమంగా సంపాదించిందని అన్నారు. ఏ వ్యాపారం చేసిన ఆ కుటుంబానికి 30 శాతం వాటా ఇవ్వాల్సిందే అని అన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని, విశ్వవిద్యాలయాలు నీరుగారి పోయాయని, ఉద్యోగ భర్తీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు రెండేనని, ఏ మాత్రం తేడా లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసిన బీఆర్ఎస్ కి వేసినట్టేనని.. ఈ రెండు పార్టీ లకి ఓటు వేస్తే మజ్లిస్ కు వేసినట్టే అన్నారు. స్టీరింగ్ మజ్లిస్ పార్టీ చేతిలోనే ఉంటుందని కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: పంచాయతీ కార్మికులకు గుడ్‌న్యూస్.. బీమా సౌకర్యం కల్పించాలని సర్కార్ నిర్ణయం