KTR-Himanshu: మంత్రి కేటీఆర్ తనయుడు కల్వంకుట్ల హిమాన్షురావు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఇటీవలే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన హిమాన్షు ఉన్నత చదువుల కోసం శనివారం రాత్రి అమెరికా పయనమయ్యారు. తల్లి శతిలమ, చెల్లెలు అలేఖ్యతో కలిసి కేటీఆర్ శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. నిన్న మొన్నటి వరకు అల్లరి పిల్లగా ఉన్న ఆ చిన్నారి ఇప్పుడు పెద్దయ్యాక కాలేజీకి వెళుతుందంటే నమ్మలేకపోతున్నానని అన్నారు. తాను ఒంటరిగా అమెరికా వెళ్లడం లేదని, తనలో సగం తన వెంట తీసుకెళ్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు హిమాన్షు చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు.
Read also: Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం
తండ్రిగా తాను కూడా విధులు నిర్వర్తించాల్సి ఉందని, వారం రోజుల పాటు కుటుంబసభ్యులతో కలిసి అమెరికా వెలుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా న్యూయార్క్, చికాగోల్లో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధినేతలతో కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యటన ముగిశాక, హిమాన్షు అమెరికన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తారు. హిమాన్షు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ చదివాడు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలో పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి హిమాన్షు తాత సీఎం కేసీఆర్, నాయనమ్మ శోభ, తల్లిదండ్రులు కేటీఆర్, శతిలమ, సోదరి అలేఖ్య హాజరయ్యారు.
Most cliched line probably from a parent but here we go
Can’t believe this Boy who was a naughty little kid till yesterday is all grown up and now off to College!! As he goes, he’s taking a part of me with him ❤️
Daddy duties; off to the US with family for over a week where I… pic.twitter.com/7k3G9oEi0u
— KTR (@KTRBRS) August 19, 2023
Hyderabad: పక్కకు ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం