R. Krishnaiah: బీసీలకు ఇచ్చేది భిక్షం కాదు.. మా వాటా అంటూ బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య కామెంట్స్ సంచలనంగా మారాయి. ఖమ్మం అంటే విప్లవమని, అనుకరణ జిల్లా కాదు ఆదర్శవంతమైన జిల్లా అని అన్నారు. స్వతంత్రభావాలు గల జిల్లా ఖమ్మం జిల్లా అని తెలిపారు.
GHMC Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎస్ఆర్డిపి రెండో విడత పనులు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
CM KCR: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మెదక్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం, పలు ప్రభుత్వ భవనాలను ప్రారంభించడంతో పాటు సాయంత్రం భారీ బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీలో జనగామ కాంగ్రెస్ విధేయుల లేఖ కలకలం రేపుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడి నియామకంలో టీపీసీసీ అధ్యక్షుడు.. ఏఐసీసీ నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆ లేఖలో జనగామ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న ( మంగళవారం ) ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది అని ఆయన అన్నారు.