ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లా జాఫర్ ఘడ్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. గెలిచినా, ఓడిన నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండేవాడు స్థానిక నాయకుడని అన్నారు. అంతేకాకుండా.. మంజూరైన పనులను మళ్లీ మేము మంజూరు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. జనవరి 17వ తారీఖు వరకు నేనే ఎమ్మెల్యేను , 17వ తారీఖు నా ఎమ్మెల్యే పదవికి ఆఖరి రోజు అని ఆయన అన్నారు. మార్పులు చేర్పులు జరుగుతాయని ముఖ్యమంత్రి చెప్తున్నారని, ఈ మధ్యలో ఆటోల్లూ ఇటు, ఇటోళ్లు అటు కావచ్చు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Bigg Boss Telugu 7: పుష్ప స్టైల్లో వెళ్లి రెచ్చిపోయిన రైతు బిడ్డ.. మామూలోడు కాదు
ప్రజాస్వామ్యంలో అందరికీ ఆశలు ఉంటాయి కానీ ప్రజలు కోరుకునే వ్యక్తులను బలపరచాలన్నారు రాజయ్య. 23 వేల మంది జనాభాతో మున్సిపాలిటీకి ప్రపోజల్ పెడితే జిల్లా మంత్రిని నాకు తెలియకుండా ఎలా చేస్తారు అని అడ్డుపడడం దురదృష్టకరమని, ఆరు నూరైనా ఎన్నికల గడువులోపే ఘనపూర్ మున్సిపాలిటీ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల తాటికొండ రాజయ్య బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో.. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తాటికొండ రాజయ్య ఇంటికి చేరుకొని మంతనాలు జరిపారు. అయితే.. వీరిద్దరి సమావేశం అనంతరం రాజయ్య బీఆర్‌ఎస్‌ను వీడడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలో నేడు తాటికొండ రాజయ్య పైవిధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Also Read : Madhya Pradesh : కట్నం కోసం నీచానికి దిగజారిన భర్త.. తాడు కట్టి బావిలోకి తోసి..