రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిదిలో బొంగుళూర్ లోని ఓ గార్డెన్ తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర రైతు సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ యూపీఏ హయాంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలను రెట్టింపు చేసి రైతన్నలకు అండగా నిలబడిన ప్రభుత్వం బీజేపిదని అన్నారు. అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రం గా తెలంగాణ ఏర్పడింది.ప్రభుత్వ భూములను అమ్మితేనే ఉద్యోగుల కు జీతాలు ఇవ్వడం జరుగుతుందని ఆరోపించారు. మద్యం టెండర్ల ద్వారా వచ్చిన డబ్బులతో ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి నెలకొంది. రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మిన ప్రభుత్వం బీజేపీదని అన్నారు. మరో 90 రోజులు పార్టీకోసం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ తెలంగాణ గడ్డపై కషాయం జెండా ను ఎగురవేయడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఓటు వేస్తే బి ఆర్ ఎస్ కు ఓటు వేసినట్లే…. బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే…ఈ రెండు పార్టీలకు ఓట్లు వేస్తే మజ్లిస్ పార్టీలకు ఓటు వేసినట్లే అని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని వసతులు ఉన్న ఈ రోజు తెలంగాణలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read : Top Headlines @5PM : టాప్ న్యూస్
రైతును రాజును చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం లో రైతు ఆత్మహత్యలు ఎక్కవగా ఉన్నాయని అన్నారు. దేశంలో పంట భిమాను అమలు చేస్తునం… ఈ రాష్ట్రంలో అమలు చేయడంలో కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడు. ఎన్నికల ముందు మాత్రం రైతు రుణమాఫీ చేయడం సిగ్గుచేటు. కల్వకుంట్ల కుటుంబం ప్రగతి భవన్ లో కూర్చొని వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నాడు. రైతులకు ఉచిత ఎరువులను ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందాడు. ఉచిత హామీలను ఇవ్వడం వాటిని విస్మరిండం కేసీఆర్ కు అలవాటుగా మారింది. గత 9 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్ట్ లను భర్తీ చేయలేదు…చివరికి ఎన్నికల ముందు ఉద్యోగ ప్రకటనలు చేస్తున్నాడు. తెలంగాణలో రైతులకు వస్తున్న విత్తనాలు కల్తీ విత్తనాలు అని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక,పంట నష్టపోయిన రైతులను ఈ రాష్ట్రంలో న్యాయం జరగడం లేదని అన్నారు.
Also Read : Hair Growth Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ఒక్కసారి ఈ హెయిర్ ప్యాక్స్ ను ట్రై చెయ్యాల్సిందే..!
వ్యవసాయ ఉత్పతులకు కేంద్రం అందిస్తున్న సబ్సిడీలను ఈ రాష్ట్రంలో అమలు చేయడంలేదని అన్నారు. దేశంలో ఎక్కడ పంటలను పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడ ఉంటే అమ్ముకునే సౌకర్యం కల్పించడం జరిగింది. ధరణి కారణంగా లక్షలాది మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటునన్నారు. కౌలురైతులకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్, బి ఆర్ యెస్ పార్టీలు రైతు చట్టాలను వ్యతిరేకించడం జరిగిందని అన్నారు.రాష్ట్రంలో నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం ఎకరాకు పదివేలు ఇస్తామని విస్మరించిందని గుర్తు చేశారు. గతంలో ఎరువుల కోసం రోజుల తరబడి నిలబడే పరిస్థితి ఉండేది… ఇప్పుడు దేశంలో అలాంటి పరిస్థితి లేదని గుర్తు చేసారు. బీఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవడం జరిగింది. రైతు బంధు ఇవ్వడం కాదు రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వలేని పరిస్థితి కి రాష్ట్రం వచ్చింది. ఒక్క మహిళ మంత్రి లేకుండా ప్రభుత్వన్నీ నడిపిన ప్రభుత్వం కేసీఆర్ ది. రిజర్వేషన్లు అమలు చేయడంలో పూర్తిగా విఫలం.’ అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
kishan reddy comments on brs government