MLA Ramulu Nayak: పువ్వాడ అజయ్ కుమార్ పై ఎమ్మెల్యే రాములు నాయక్ ఫైర్ అయ్యారు. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదంటూ రాముల నాయక్ మంత్రి పువ్వాడ చేయకు హెచ్చరికలు జారీ చేశారు. వైరా నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలో తన ఒక్కడే గెలిచి మిగిలిన నియోజకవర్గాల్లో అందరూ ఓడిపోవాలని కుట్ర మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్నాడని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా తన విధుల్ని నిర్వహించు కోనీయకుండా పువ్వాడ అజయ్ చేస్తున్నాడని ఆరోపించారు. కేటీఆర్ రాజు యువరాజు అయితే సామంత రాజుగా పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనపై కుట్రలు పన్నుతున్నాడని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని రాముల నాయక్ ఆరోపించారు. అంతేకాదు పువ్వాడ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యే వా? లేక వైరా నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావా? అని ప్రశ్నించారు. దళిత బంధు లబ్ధిదారులు ఎంపికలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ రాముల్ నాయక ఆరోపించారు.
Read also: Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం.. అవకతవకలు జరిగితే బాధ్యత అధికారులదే
నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు ఎంపికలు మంత్రి పువ్వాడ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో విధులని ఆటంకపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదంటూ రాముల నాయక్ మంత్రి పువ్వాడ చేయకు హెచ్చరికలు జారీ చేశారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తన నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక చేపట్టినప్పటికీ ఎంపిక చేసిన లిస్టుని ఉన్నతాధికారులకు పంపించారు. అయితే తాజాగా వైరా ఎమ్మెల్యేగా మదన లాల్ లని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేయడంతో మరో లిస్టుని ఎమ్మెల్యే అభ్యర్థి మదన్ లాల్ ఉన్నతాధికారులకు పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్ అండదండలతోనే మదన్ లాల్ ఈ విధంగా తన వ్యవహారాల జోక్యం చేసుకుంటున్నారని రాముల్ నాయక ఆరోపిస్తున్నారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినప్పటికీ మదన్ లాల్ కు సహకారం చేస్తానని చెప్పినప్పటికీ మదన్ లాల్ మంత్రి ఇద్దరు కలిసి దళిత బందు లబ్ధిదారుల ఎంపిక లో కుట్రలు చేయడం ఏమాత్రం సబబా అంటూ రాముల్ నాయక్ ప్రశ్నించారు. మరి దీనిపై పువ్వాడ అజయ్ కుమార్ ఎలా స్పందిస్తారునే విషయంపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదు