Kishan Reddy: హోంగార్డు రవీందర్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్.. చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రవీందర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే అని మండిపడ్డారు. హోంగార్డులకు కనీస ఆత్మగౌరవాన్ని కూడా ఇవ్వకుండా.. వేధిస్తున్న బీఆర్ఎస్ సర్కారు తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంగార్డులు తొందరపడొద్దని.. ఆత్మహత్యలే మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కాదని విజ్ఞప్తి చేశారు. పోరాడి సాధించుకుందాం తప్ప.. ఆత్మహత్యలు చేసుకొవద్దని సూచించారు.
Read also: Warangal: దగ్గరపడుతున్న పెళ్లి ముహుర్తం.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న వరుడు
హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించిన విషయం తెలిసిందే.. హోంగార్డు రవీందర్ ను కలిసి పరామర్శించేందుకు నిన్న మధ్నాహ్నం ఆసుపత్రికి వెళ్లి, రవీందర్ ను కుటుంబ సభ్యులను పరామర్శించారు. హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వాళ్ళ ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలి.. హోంగార్డ్ లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన చూడండి అంటూ వీడియో ప్లే చేసిన కిషన్ రెడ్డి.. ఐదున్నర సంవత్సరాలు గడిచినా.. సీఎం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు అని ఆయన మండిపడ్డారు. హోంగార్డులకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే.. హోంగార్డ్ ల అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని ఆయన హామీ ఇచ్చారు.
Traffic ACP: హ్యాట్సాఫ్ మేడం.. డ్రైనేజీ చెత్తను చేతితో తీసిన మహిళా పోలీస్