తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పు కొచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందించారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కి ఎందుకు వెళ్తున్నారు?.. రాష్ట్ర సంపదను మహారాష్ట్రలో ఎందుకు ఖర్చు చేస్తున్నారు?.. అని ప్రశ్నించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అని చెప్పిన కవిత బీఆర్ఎస్ పార్టీ ఎంత మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చింది? అని షబ్బీర్ అలీ అడిగారు.
తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయని.. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గోస-బీజేపీ భరోసా భారీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్.. సోనియా కుటుంబం కోసం, బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తుందని ఆరోపించారు.
ములుగు జిల్లా బీఆర్ఎస్లో నిరసన సెగలు రగులుతున్నాయి. మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పార్టీ కార్యకర్తలతో సారంగపల్లిలో భేటీ అయ్యారు. ములుగు నుంచి బరిలో దిగనున్నట్లు ప్రహ్లాద్ తెలుపుతున్నారు. ఇంచార్జ్ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడంపై ప్రహ్లాద్ అసంతృప్తి సెగలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీపై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్ పూర్తిగా కుట్ర పూరితమేనని ఆరోపించారు.
హైదరాబాద్ లో సీపీఎం తెలంగాణ కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంఠి రంగారెడ్డి, సీతారాములు సహా ఇతర సభ్యులు హాజరయ్యారు. బీఆర్ఎస్, బీజేపీకి దగ్గరవుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పొత్తు ధర్మం పాటించ లేదని పేర్కొన్నారు.
Harish Rao: మంత్రి హరీష్ రావు నేడు సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం కోమటి చెరువులో దాదాపు 4500 డ్రోన్లతో డ్రోన్ షో నిర్వహణ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొననున్నారు.
Balka Suman: కాంగ్రెస్లో ఉన్నది మనవాళ్లేనని, మననే పంపారని అన్నారు. వెంకన్న రాలేదా.. అలాగే వాళ్లుకూడా వస్తారంటూ చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, వేములవాడ ఎమ్మెల్యే ప్రొ.చెన్నమనేని రమేష్బాబును రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యవహారాల సలహాదారుగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నియమించారు. ఆయన ఐదేళ్లపాటు కేబినెట్ హోదాతో ఆ పదవిలో కొనసాగుతారు. Breaking news, latest news, telugu news, big news, cm kcr, chennamaneni ramesh babu, brs, vemulawada news