ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రయాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లూరు పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్‌లో ఆమె ప్రసంగించారు. ‘ఇందిరగాంధీకి తెలంగాణ అంటే చాలా ఇష్టం. చనిపోయిన ఇన్నేళ్లకు కూడా ఇందీరా గాంధీ మీ అందరికి గుర్తున్నారంటే ఆమె చేసిన పాలనే. భూమి.. నీళూ.. నీధుల కోసం పోరాటం చేసి అభివృద్ధి చేశారు కాబట్టే మిరందరూ ఆమెను గుర్తుపెట్టుకున్నారు. నాయకులు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాలి.. ఎదిరించాలి. కేసిఆర్ పది…
నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలంలో నేడు జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాచాలపల్లి, ఉర్కొండపేట, జకినాలపల్లి, గునగుంట్లపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. అందులో భాగంగా.. ఆదిలాబాద్ లోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో కాంగ్రెస్ ప్రజా విజయభేరి సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన కొనసాగుతోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు విరుధ్ధంగా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. ప్రజలు కన్న కలలు నెరవేరటంలేదు.. అమరుల ఆశయాలు నెరవేరట్లేదని ఆరోపించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటిస్తున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా ఆమె రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియాకం గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యాగాలు వచ్చాయి.. తెరాస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి..
తెలంగాణలో కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది.. కర్ణాటకలో 100 కోట్ల మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు.. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని డీకే శివకుమార్ అన్నారు.
Minister KTR: ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు జేబీఎస్ నుంచి తూంకుంట వరకు స్కై వేలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామని, అయితే కేంద్ర మంత్రులను కలిసి రక్షణశాఖ భూములను ఇవ్వాలని కోరితే, అందుకు అంగీకరించలేదని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ స్కైవేలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Harish Rao: కాంగ్రెస్ నేతల మాటలు, కాంగ్రెస్ హమీలపై బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మూడు గంటలు కరెంట్ చాలన్న ఆయన నిన్న నారాయణఖేడ్ వచ్చాడని, పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇస్తామని, ఆ రాష్ట్ర ఓటర్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ఉన్న గోచి ఊడిపోయిందని అన్నారు.
Vivek: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు, 2004లో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. సీఎంకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 85 ప్లస్ ఓట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని జోక్యం చెప్పారు. బీఆర్ఎస్ది అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన కాచిగూడ బాలప్పబాడ, లింగంపల్లి కురుమ బస్తీ, చెప్పల్ బజార్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేషన్ మాట్లాడుతూ.. ఢిల్లీ రిమోట్‌తో పనిచేసే ఎమ్మెల్యే కావాలా? స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కరించే ఎమ్మెల్యే కావాలా? ఆలోచించి ఓటు వేయాలని అంబర్ పేట నియోజకవర్గం ఓటర్లకు ఆయన పిలుపునిచ్చారు. Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో…