Telangana Elections: నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర.. మూతపడనున్న మైకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Elections: రాష్ట్రంలో నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రచారంలో పరిగెత్తుతున్న అభ్యర్థుల మైకులు మూగబోనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ అనంతరం అభ్యర్థులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని ఓటర్లకు ప్రసన్నం చేసుకునేందుకు బయలు దేరారు. జెండాలు పట్టుకుని ఊరువాడ అదిరే రీతిలో ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగుస్తుంది. ప్రచార గడువు ముగియగానే నియోజకవర్గాల నుంచి స్థానికేతర నాయకులు వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల్లో విజయానికి సహకరించాలని ఓటర్లను వేడుకున్నారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 2298 మంది పోటీ చేసి తమ శక్తియుక్తులను వినియోగించి ప్రజల మద్దతును కోరారు.
Read Also:CM KCR: నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్ పీరియడ్‌లో టీవీ, సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్ కోడ్ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్‌లు, గెస్ట్ హౌస్‌లు, హోటల్‌లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదని స్పష్టం చేశారు.
Read Also:Health Tips : శరీరంలో వేడిని తగ్గించే జ్యూస్ ఇదే.. ఎలా తయారు చెయ్యాలంటే?
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!