ఆదిలాబాద్ లో ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటినుండి నేను తెలంగాణాలో పర్యటిస్తున్నాను.. ఇక్కడ కాంగ్రెస్ అనుకూల వాతావరణం కనిపిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. అబద్దాలతో రెండుమార్లు అధికారంలోకొచ్చారని తెలిపారు. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీలేవీ నెరవేర్చలేదని మండిపడ్డారు. 10 ఏళ్ళ తెలంగాణాలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని పేర్కొన్నారు. భూమి, నీరు, మద్యం, ఖనిజవనరులన్నీ కేసీఆర్ కుటుంబ దోపిడీకి గురయ్యాయని తెలిపారు. తెలంగాణా ప్రజలు చైతన్యవంతులు.. కాంగ్రెస్ తన హామీలను ఎల్లపుడూ నిలబెట్టుకుందని అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారు.. వారు ఈ మారు మోసపోవటానికి సిద్ధంగా లేరని భూపేష్ బఘేల్ తెలిపారు. రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ళు, రైతుబంధు, యువవికాసం, మహాలక్ష్మీ, పింఛన్ల పథకాలు జనానికి మేలు చేసేవని పేర్కొన్నారు.
Suriya : మమ్ముట్టి సినిమాపై ప్రశంసలు కురిపించిన సూర్య..
ఛత్తీస్ ఘడ్ లో ఒక కోటి ఎకరాల భూమిని ఆదివాసులకు పంపిణీచేశామని సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ అభివృద్దికి కేంద్రం నుండి ఆశించిన సహకారం లేదని తెలిపారు. రూ. 9.5 వేలకోట్ల నిధులను ఆదివాసీ ప్రాంతాల కొరకు ఖర్చు చేశామన్నారు. మోదీ, కేసీఆర్ లు ఇద్దరిదీ ఒకే విధానమని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ అంటే నమ్మకం అని అన్నారు. దళితులకు 3 ఎకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బంధు, విద్య, వైద్యం ఇలా అన్ని హామీలూ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
Bear Attack: జూపార్క్‌లో ఎలుగుబంటి దాడి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మృతి
కర్నాటక తరహా ఫలితాలే తెలంగాణాలో రానున్నాయని సీఎం భూపేష్ బఘేల్ తెలిపారు. తెలంగాణా ఆర్థిక పరిస్థితి తమ 6 గ్యారంటీల పై ప్రభావం చూపబోదన్నారు. కర్నాటకలో విజయరహస్యం ఇదేనని వివరించారు. రైతులు, మహిళలకు వెచ్చించే నిధులు తిరిగి సమాజంలోనే వినియోగమౌతాయని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. బడాబాబులకు వెసులుబాటే ఆర్థిక పరిస్థితికి చేటు అని తెలిపారు. కాంగ్రెస్ తో కేసీఆర్ కు భయం పట్టుకుందని.. ఎమ్మెల్సీ కవిత విషయంలో కేవలం ఈడీ నోటీసులతో సరిపెట్టడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య బంధానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణలో కరెంటు తామే సప్లై చేస్తున్నామని.. దానికి సంబంధించిన డబ్బులు ఇంకా కేసీఆర్ సర్కార్ బకాయిపడి ఉందని భూపేష్ బఘేల్ తెలిపారు.