ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి తరుఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏటూరునాగారం రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ములుగులో వంద శాతం గెలుస్తామన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే అభివృద్ది ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది అని కేటీఆర్ అన్నారు.
ములుగులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేక పోయినా.. జిల్లాను చేసిన ఘనత కేసిఆర్ ది అని తెలిపారు.
Kaleru Venkatesh: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుంది
ఇన్స్టాగ్రామ్ ఎమ్మెల్యేను కాదు.. ఇక్కడే ఉండి మీకు సేవ చేసే ఎమ్మెల్యేను గెలిపించండని అక్కడి ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. కరెంట్ గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలకు సిగ్గులేదని దుయ్యబట్టారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఎన్నికల కమీషన్ కు ఉత్తరం రాయడం వల్లే రైతు బందు ఆగిందని మంత్రి తెలిపారు. రైతుల నోటికాడి బుక్క దూరం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇలాంటి.. కాంగ్రెస్ దరిద్రాన్ని మళ్ళీ నెత్తిన పెట్టుకుందామా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మార్పు కావాలి కాబట్టే.. మీ దిక్కు మాలిన కాంగ్రెస్ కు విముక్తి చెప్పి తెలంగాణా తెచ్చుకున్నామని అన్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ కాదు.. చెత్త పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం ఎన్ని కథలైనా చెపుతారు నమ్మొద్దు.. ములుగు ప్రజలు గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయవద్దని కేటీఆర్ తెలిపారు. నాగ జ్యోతిని గెలిపిస్తేనే ములుగును అభివృద్ధి చేస్తాం.. లేకపోతే తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏమీ చేయమని కేటిఆర్ కరాఖండిగా చెప్పారు.
Minister Dharmana Prasada Rao: పేదరికంతో ఉండి దరఖాస్తు చేస్తే సంక్షేమం అందిస్తాం..
మరోవైపు.. ములుగు ప్రాంత అభివృద్ధి సీఎంతోనే సాధ్యం అయ్యిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కళ్ళముందే బూతద్దంలా ములుగు అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. 100 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఏటూరునాగారంలో బస్ డిపో, మోడల్ కాలనీలు, బిల్ట్ కర్మాగారాన్ని తెరిపిస్తామన్నారు. అంతేకాకుండా.. శివవసత్తులకు గౌరవవేతనం ఇస్తామని తెలిపారు. పేదలకు ఇల్లు, కొండాయి బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు సౌభాగ్య లక్ష్మీ కింద నెలకు 3 వేలు ఇస్తామని చెప్పారు. కార్డులు, పింఛన్లు ఇస్తాము.. అన్నపూర్ణ ద్వారా సన్న బియ్యం ఇస్తాం.. రూ.400 లకే గ్యాస్ ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.