V Hanumantha Rao: హరీష్ రావు తొందర పడుతున్నారు అంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ మూడు ఎకరాల.. డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని చెప్పారన్నారు.
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మాని అభయ హస్తం హామీల అమలు గురించి ఆలోచించండని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీల అమలుకు తేదీలు కూడా చెప్పారు.. ఆ తేదీలు గడిచిపోయినా ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి గురించి…
మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.. అధికారులపై మంత్రులు ప్రశ్నలు వర్షం కురిపించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 412 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. వాటికి నిధులు సమీకరించలేక శ్వేత…
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. అందుకోసం జనవరి మూడో తేదీ నుంచి బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి,…
కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని... ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజలు అడిగేది పథకాలు.. పత్రాలు కాదని జగదీష్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు లేకుండా... దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం…
లోక్ సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.., బీఅర్ఎస్ చిత్తుగా ఓడటం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8మంది ఎమ్మెల్యే లు గెలవడంతో అసలు విజయం బీజేపీదేనని ఆయన వ్యాఖ్యానించారు. బీఅర్ఎస్, కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి పోయారని, అందుకే ఇది కాంగ్రెస్ గెలుపు కాదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకొని రాష్ట్రానికి అప్పులు పెంచిందని ఆయన ఆరోపించారు. బీఅర్ఎస్ నాయకుల…
Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఘనతలు మాకన్నా.. ప్రజలకే ఎక్కువ తెలుసు అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Ponguleti: అప్పులు చేసి భవనాలు కడితే అభివృద్దా? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ ను ఎందుకైతే అధికారం లోకి తెచుకున్నారో 100 కు 100 శాతం అమలు చేస్తున్నామన్నారు.
MP Bandi Sanjay Said BRS Will Lost Deposits in Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీదారు కానేకాదని, డిపాజిట్లు గల్లంతవ్వడం తథ్యం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించినా కేసీఆర్ కొడుకుకు అహంకారం తగ్గలేదని, ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమలో ఉంటూ మాట్లాడుతున్నాడని విమర్శించారు. శ్వేత పత్రం, స్వేద పత్రం అంటూ అక్షరాలు మార్చి.. కాంగ్రెస్, బీఆర్ఎస్…
KTR Review Meeting With Chevella BRS Leaders: లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం అయ్యారు.…