KTR : బోరబండ ఇబ్రహీం ఖాన్ ఇంటికి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్ కి తన ట్వీట్ లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని అయితే ఈ ఐదు సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతిగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని ఆయన కోరారు! బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్ కి తన ట్వీట్ లో విజ్ఞప్తి చేశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇబ్రహీం ఖాన్ కు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీంఖాన్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట మేరకు ఈరోజు కేటీఆర్ బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్ కు ఇబ్రహీం ఖాన్ సాదరంగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. దివ్యంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా గతంలో ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పించన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్ కి ఇబ్రహీం ఖాన్ కుటుంబం తెలియజేసింది.
Also Read
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు చెవుడు ఉన్నందున వారికి అవసరమైన చికిత్స ఖర్చులు అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తినిస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో ఉన్నారు. కేటీఆర్ బోరబండకి రావడంతో వందల మంది ప్రజలు, అభిమానులు పార్టీ కార్యకర్తలు ఇబ్రహీంఖాన్ ఇంటి వద్ద గుమికూడారు.
తాజావార్తలు
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
-
Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
-
Ind Vs WI: శివాలెత్తిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం.. మూడు సెంచరీలు నమోదు..
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!