Ponguleti Srinivas Reddy : ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా తీర్చిదిద్దారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను గతంలో సవాల్ చేసినట్టు 10కి 10 సీట్లు అన్నానని, అన్నం తింటుంటే ఓ మెతుకు జారిపడ్డట్టు ఓ స్థానం పోయిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగిలిన 9 స్థానాల్లో మనమే గెలిచామన్నారు. మమ్మల్ని ఓడించాలని విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని, అధికారులను ఉపయోగించి అక్రమ కేసులు పెట్టారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ఏ మీటింగ్ లో మాట్లాడినా మా ఇద్దరి గురించేనన్నారు. కరటక ధమణుకలు అని మాకు పేరు పెట్టారని, డబ్బు మదం తో మాట్లాడుతున్నారు అని అన్నాడన్నారు. మేమేమన్న అధికారంలో ఉన్నామా అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులుగా ఉన్నామా ప్రజల సొమ్ము దోచుకోవడానికి, కాంట్రాక్టులన్నీ ఆయన గారి బంధువులకు ఇచ్చి తెర వెనకాల ఉండి నడిపించారన్నారు. అధికార మదం మీకుండేదని, మేము సేవకులమన్నారు. శక్తి వంచన లేకుండా మంత్రులందరం ప్రజల కోసమే పనిచేస్తామని, అసెంబ్లీ లో పోట్ల గిత్తళ్ల వ్యవహరించారన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా తీర్చిదిద్దారన్నారు. గత ప్రభుత్వ అప్పులను ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి భట్టి గారు వివారిస్తుంటే గొడవకు దిగారని, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీల అమలు చేసామన్నారు.
అంతేకాకుండా.. ‘అప్పటికే అవాకులు చేవాక్కులు పేలారు…. తల తాకట్టు పెట్టైనా 6 గ్యారెంటీల అమలు చేసి తీరుతాం…. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తే తిప్పికొట్టాలని కోరుతున్న…. 10 సంవత్సరాల మీ బాధలను తీర్చేందుకు ప్రజాపాలన మీ చెంతకు చేర్చాం…. ప్రజల బాధలు కోట్లలో వచ్చాయి అప్లికేషన్ల రూపంలో…. 100 రోజులలోపే మీ సమస్యలు తీరుస్తున్నాం…. మీ హయాంలో ఏ నెలలో ఇచ్చారు రైతుబంధు…. సిగ్గుందా మీకు మమ్మల్ని అనడానికి…. కబ్జాలకు గురైన స్థలాలను వెనక్కు తీసుకోమని ఇప్పటికే కలెక్టర్ కు ఆదేశాలిచ్చాము…. దోచుకున్న ప్రతి రూపాయిని కక్కించి మీకే ఖర్చు పెడతాం…. మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం … మంచి అధికారులను కాపాడుకుంటాం…. తప్పు చేసిన అధికారులు మనల్ని చూసి సిగ్గుతో తల దించుకుంటున్నారు….’ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Also Read
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
- Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
తాజావార్తలు
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!