Raghunandan Rao: బీజేపీ, బీఆర్‌ఎస్ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి ఈ ప్రచారాన్ని నమ్మకండి అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ఎ ప్పుడు ఒకటి కాదని తెలిపారు. కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని అన్నారు. దయచేసి ఈ ప్రచారం నమ్మవద్దని తెలిపారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుందని అన్నారు. బిల్కిస్ బానో కేసులు కుహనా లౌకిక వాదులు నిన్న కేటీఆర్, రాహుల్, కవితలు మాట్లాడారని, మోడీ నీ విమర్శించారని మండిపడ్డారని తెలిపారు. సుప్రీం కోర్ట్ తీర్పును స్వాగతించారని, చెంప పెట్టు అని కామెంట్ చేశారని అన్నారు. రామ మందిర నిర్మాణం జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీం కోర్టు అని గుర్తు చేశారు. ఎందుకు మీరు స్వాగతించడం లేదు? అని ప్రశ్నించారు. మీరు ఎవరు వారసులు… రావణుడి, శూర్పణఖ వారసుల… మీ నోళ్ళు ఎందుకు పెకలడం లేదంటూ మండిపడ్డారు. షబానో కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చింది… ప్రస్తుత చీఫ్ జస్టిస్ తండ్రి ఆ జడ్జ్ మెంట్ ఇచ్చారు.
Read also: Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భారత మార్కెట్‌లోకి రియల్‌మీ 12 సిరీస్!
భరణం ఇవ్వాలని ఆదేశించిందని అన్నారు. సుప్రీం కోర్టు జడ్జి మెంట్ ను పక్కన పెడుతూ రాజీవ్ గాంధీ దానికి వ్యతిరేకంగా చట్టం తెచ్చారని తెలిపారు. ఒక కేసులో ఒక రకంగా ఇంకో కేసులో ఇంకో రకంగా స్పందించటం సెక్యులరిజం కాదని సూచించారు. జ్ఞాన వాపి పై కోర్ట్ ఇచ్చిన తీర్పును కూడా స్వాగతించండని తెలిపారు. ముస్లింలకి అనుకూల తీర్పులను స్వాగతించడం, హిందువులకు అనుకూలంగ వస్తె వ్యతిరేకించడం మీ వక్ర బుద్ధికి నిదర్శనమన్నారు. టేకుల లక్ష్మిపై రేప్ జరిగి మర్డర్ జరిగితే కేటీఆర్, కవిత ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. సర్వ ధర్మ సమభావనతో రాముడు రాజ్యాన్ని పాలించాడని అన్నారు. రాహుల్ గాంధీ ఆదేశిస్తే నే నేను వెళ్లి కేసీఆర్ ను కలిశాను అని రేవంత్ రెడ్డి చెప్పారని.. వాళ్లంతా ఒకటే అనడానికి ఇది నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Devara: దేవర vs భైరవ… పార్ట్ 1కి ఇదే క్లైమాక్సా?