Bhatti Vikramarka: సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండంలం బనిగండ్లపాడులో ప్రజా పాలన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. స్టాల్స్ వద్ద దరఖాస్తులను తీసుకుని పరిశీలించారు. అనంతరం బానిగెండ్ల పాడులో ప్రజా పాలనలో 3,90,000 వేల దరఖాస్తులు స్వీకరించినట్లు డిప్యూటీ సీఎం కు కలెక్టర్ గౌతమ్ వివరించారు. ఇక భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దోపిడీ చేయకుండా సంపద ను ప్రజలకు పంచి పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చామన్నారు. అమలు చేయని మూడు ఎకరాల హామీ మాదిరిగానే అరు గారెంటీ పథకాలు అమలు కాకుండా వుంటే బాగుండు అని కొంత మంది ఆలోచించారని తెలిపారు. రాకుండా వుంటే బాగుండు అని అనుకునే వారి ఆలోచనలు సాగవన్నారు. పది ఏళ్ల పాలన చేసిన వారు హామీలు అమలు చేయకుండా ప్రజల చేతిలో వాతలు పెట్టించుకున్న వారు ఇప్పుడు ప్రభుత్వం పై విమర్శలు చేయడం అర్ధ రహితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలం లో బి అర్ ఎస్ ఏ ఒక్క ఊరిలో కూడా కాలనీలు కట్టలేదన్నారు. అయిదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునెందుకు ఇస్తామన్నారు.
Read also: Onion Benefits: ఉల్లి పాయకు ఇంత పవర్ ఉందా?
రాష్ట్రాన్ని వుడ్చేశామూ ఇంకా ప్రజలకి కాంగ్రెస్ ఏమి చేస్తుందని అనుకుంటున్నారు కొందరు అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఏమి రాకుండా గత ప్రభుత్వం చేసిందన్నారు. ఎన్ని కష్టాలు వున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు. అయినా ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెబుతున్నానని అన్నారు. అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అందుకనే శ్వేత పత్రలను తీసుకుని వచ్చామని తెలిపారు. అప్పుల రాష్ట్రం గానే చేసింది గత ప్రభుత్వం అన్నారు. జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. తాము అధికారం లోకి రాగానే ఉద్యోగస్తులకు ఒక్కటవ తేదీన ఇస్తున్నామని తెలిపారు. సంపద ఎలా స్తృష్టించాలో మాకు తెలుసన్నారు. భద్రాద్రిలో పనికి రాని టెక్నాలజీ తీసుకుని వచ్చారని అన్నారు. లక్ష కోట్ల అప్పు కరెంట్ పై చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుల భారాన్ని మొస్తునే నాణ్యమైన కరెంట్ ఇస్తామన్నారు. ఈ ప్రభుత్వంలో అందరూ జవాబు దారులే అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా ఉండేలా చేస్తామన్నారు.
Eyes: కంప్యూటర్, మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ ఆహారాలు తిన్నాల్సిందే..!