కార్యకర్తలు రక్తం చెమటగా మార్చడం తోనే నేను సీఎం గా గౌరవం దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయ్యాకా.. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్.. మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కాగానే ఆరు నెలలు కాకముందే…
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దోపిడి దొంగల పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ అగ్గి…
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని అధికార మదంతో రాసిరంపాన పెట్టిన వారిని ఒక చూపు చూడాల్సిందే అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేయని వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పథకాలని గ్రామ నాయకత్వం ద్వారానే ప్రజలకు అందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు .మనకి సహకరించని వారిని మనల్ని ఇబ్బందులు పెట్టిన వారిని రాసి రంపాల పెట్టిన…
కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న ప్లాట్ కూడా లేకుండే. ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్ దే అంటున్నారు.. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చాం.. అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.
సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబంలో మెదక్ ఎంపీ సీటు కోసం గొడవలు జరుగుతున్నాయి అని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లేఖలో కోరారు.
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై దుర్భాషలాడిన ఘటనలో ఎంపీ రంజిత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టారని.. బెదిరింపులకు పాల్పడినట్లు మాజీ ఎంపీ ఆరోపించారు.
లోక్‌సభ సెగ్మెంట్ల సన్నాహక సమావేశాల తర్వాత, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషించేందుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే పరాజయం పాలైనట్లు పార్టీ భావించింది. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు మాట్లాడుతూ.. జనవరి 3న ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు సోమవారం నల్గొండ…
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో అందించగలిగాము.. రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగాము అని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.