Kishan Reddy : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఓటేసిన బీఆర్‌ఎస్‌కు ఓటేసిన ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు బీజేపీకి ప్రధాన పార్టీ అని, బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో ఉండదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్ అరకొర సీటు గెలిచిన, ఒడినా తెలంగాణకు ఒరిగేది పోయేది ఏం లేదని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ కుటుంబం కోసం పని చేసే పార్టీ.. కుటుంబ అవశ్యకత పూర్తి అయిపోయిందన్నారు. హైదరాబాద్ ఎంఐఎం సీటుతో పాటు తెలంగాణలో అన్ని సీట్లు గెలుస్తామన్నారు.
హైదరాబాద్ ఎంపీ సీటులో అసదుద్దీన్ ను ఓడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. సర్వేలు వాస్తవాలు కావని, తెలంగాణలో మెజార్టీ సీట్లు బీజేపీ గెలిచెలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌లు డూప్ ఫైటింగ్ చేస్తున్నారని, వంద రోజుల్లో హామీలు ఆమలు, అవినీతి పరులు పై చర్యలు అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇంకా మిన మేశాలు లెక్క పెడుతున్నారని, ఇంకా సెటిల్ మెంట్లు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరంపై చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఆడుకోవద్దని ఆయన అన్నారు. జల వివాదాల పై ప్రజలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లు మభ్య పెడుతున్నారని, నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలని, బీజేపీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటుందన్నారు.
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
మళ్లీ మోడీ పీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటారన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే కేంద్ర కాంగ్రెస్ కోసం వసూళ్లు మొదలు పెట్టిందని, కేంద్ర కాంగ్రెస్ కు సూటు కేసులు మోస్తున్నారన్నారు. కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెడితే.. తెలంగాణ లో కాంగ్రెస్ దోపిడీ చేస్తోందన్నారు. కాంగ్రెస్ కూటమీ బీటలు వారుతోందని, అత్యధిక స్థానాలు తెలంగాణ నుంచి గెలుస్తుందన్నారు. బీఆర్‌ఎస్ లో ఉన్న నేతలు బీజీపీ లో చేరాలి. అందుకు నేను పిలుపు ఇస్తున్నానని ఆయన అన్నారు. అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేస్తోందని, 17 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోందన్నారు. డబ్బుల కోసం మంత్రులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బెదిరిస్తున్నారని, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో లో బిజెపి స్వతంత్రంగా పోటీ చేస్తోందన్నారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?