Telangana: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బిజినెస్ అడ్వై జరీ కమిటీ (బీఏసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఈనేపథ్యంలో నిన్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నిన్న (గురువారం) మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్లో కమిటీ సమావేశమైంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ సభలో తీర్మానం ప్రవేశపెడ్తారు. దానిపై చర్చించిన తర్వాత సభ వాయిదా వేస్తారు. రేపు (శనివారం) అసెంబ్లీ, కౌన్సిల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడ్తారు. ఇక సోమవారం బడ్జెట్‌పై సాధారణ చర్చ నిర్వహిస్తారు. మంగళవారం బడ్జెట్‌పై సాధారణ చర్చకు సమాధానమిస్తారు. మూడు నెలల కాలానికి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదా వేస్తారు.
Read also: Guntur Kaaram: ఓటీటీలోకి వచ్చేసిన ‘గుంటూరు కారం’.. ఎక్కడ చూడొచ్చంటే?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించిందన్నారు. ప్రగతిభవన్‌ను.. ప్రజాభవన్‌గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు. అర్హులైన వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నాం.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు.. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.
Eagle X Review: మోతుబారి హిట్ కొట్టినట్లేనా?